Holiday
Holiday : తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు వచ్చాయి. దీంతో చాలా మంది ఇప్పటికే ఊళ్ల బాట పట్టారు. అయితే ఏపీలో మంగళవారం(Tuesday) సెలవుపై సందిగ్ధం నెలకొంది. తెలంగాణలో మార్చి 31, ఏప్రిల్ 1న సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : సోమవారం కూడా సెలవే.. ‘పండుగ’ చేసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఆదివారం(Sunday) సెలవు అయినా ఉగాది వచ్చింది. సోమవారం(మార్చి 31న) రంజాన్ సెలవు, ఏప్రిల్ 1న రంజాన్ తర్వాతి రోజు సెలవు ఇచ్చారు. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం రంజాన్ తర్వాతిరోజు సెలవుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఊళ్లకు వెళ్లినవారిలో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1, 2025 (మంగళవారం) నాడు ఆంధ్రప్రదేశ్‌లో ఆప్షనల్ హాలిడే ఉందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విన్నపంతో..
ఏపీ వక్ఫ్‌బోర్డు(AP waqf board) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి విన్నపంతో ఏపీ తాజాగా మంగళవారం ఆప్షనల్ హాలిడే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీఎస్ కే.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం జారీ చేసిన 2025 సంవత్సరానికి సంబంధించిన జనరల్ మరియు ఆప్షనల్ హాలిడేల జాబితా (G.O.Rt.No2115, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, డేటెడ్: 06.12.2024) ప్రకారం, ఏప్రిల్ 1న ఎలాంటి ఆప్షనల్ హాలిడే ప్రకటించబడలేదు. అయితే, ఈ తేదీకి సంబంధించి ఏదైనా కొత్త ఉత్తర్వులు జారీ అయి ఉంటే, అది సాధారణంగా రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) వంటి పండుగల నేపథ్యంలో ఈ సెలవుపై నిర్ణయం తీసుకుంది.
Also Read : స్కూళ్లకు వేసవి సెలవులు.. తేదీ ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..