Raja Singh
Raja Singh : రాజాసింగ్(Rajasingh).. ఈ పేరు తెలియని హిందువు ఉండరు. హిదుత్వం కోసం ప్రాణాలు కూడా ఇచ్చేంతటి కరుడుగట్టిన హిందూవాది. ఫైర్‌బ్రాండ్. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడేస్తాం‘ అని ఆయన ప్రకటించారు. మహారాష్ట్రలోని హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు అవసరమైతే వెళతారని, అయోధ్య(Ayodhya)లో రామమందిర నిర్మాణం తర్వాత ఔరంగజేబు, బాబర్ వారసులు ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)అజెండాలో భారత్‌ను హిందూ దేశంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు హిందూ దేశ భవిష్యత్తు, కాశీ, మథుర అంశాలపై ఆధారపడతాయని చెప్పారు.
Also Read : పాత సామాన్ వెళ్లిపోతేనే పార్టీకి మంచి రోజులు.. సొంత పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
ఛావా సినిమా ప్రభావం..
ఈ వివాదానికి మూలం విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ‘ఛావా’ (Chava)చిత్రం. ఛత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ మహరాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా హిందీ, తెలుగుతో సహా పలు భాషల్లో భారీ విజయం సాధించింది. శంబాజీ మొఘలులతో యుద్ధం, మరాఠా సామ్రాజ్య ఏకీకరణ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. క్లైమాక్స్‌లో ఔరంగజేబు చేతిలో శంబాజీ దారుణ మరణం చూసి చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో మడాక్ ఫిల్మŠస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ‘ఛావా’ రిలీజ్ తర్వాత ఔరంగజేబు సమాధి వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
సందర్శకులపై ఆంక్షలు..
మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న ఈ సమాధి వద్ద సందర్శకులపై ఆంక్షలు విధించారు. సున్నితమైన ఈ అంశంపై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజాసింగ్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారని, ఎంఐఎం ఆదేశాలతోనే ఇది జరిగిందని ఆరోపించారు. ఈసారి శోభాయాత్రకు దరఖాస్తు కూడా చేయలేదని తెలిపారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి. ‘ఛావా’ శంబాజీ ధైర్యసాహసాలను తెరపై చూపిస్తూ ఔరంగజేబు చరిత్రను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వంటి నేతల వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి.
Also Read : మీ వేధింపులు తట్టుకోలేపోతున్నా.. ఉండమంటే ఉంటే.. పొమ్మంటే పోతా.. బాంబు పేల్చిన రాజాసింగ్!