Holi during lunar eclipse rules: 2026 సంవత్సరంలో తొలి గ్రహణం మార్చి 3న సంభవించనుంది. ఫాల్గుణ పౌర్ణమి రోజున గ్రస్తోదయ చంద్రగ్రహణం ఉంది. అదే రోజు హోలీ పండుగ ఉందని పండితులు చెబుతున్నారు. కొందరు బుధవారం హోలీ జరుపుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. గ్రహణ సమయం ఏమిటి.. గ్రహణ ప్రభావం ఎవరిపై ఉంటుంది.. హోలీ జరుపుకోవాలా వద్దా అన్న సంగ్ధం నెలకొంది.
గ్రస్తోదయ గ్రహణ లక్షణాలు
చంద్రుడు భూమి ఛాయపడి ఉదయించనున్నాడు. అందుకే దీనిని గ్రస్తోదయంగా పిలుస్తున్నారు. ఈ గ్రహణం సింహరాశి పూర్వఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు గ్రహణ కాలం ఉంది. కానీ చంద్రోదయం (సాయంత్రం 6:20 సమయంలో) విడుపు దశలో మాత్రమే కనిపిస్తుంది. తూర్పు భారత రాష్ట్రాల్లో పాక్షికంగా, ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం తెలుగు సంవత్సరాదిలో చివరిది. ఇంగ్లిష్ సంవత్సరంలో మొదటిది.
ధార్మిక నియమాలు, సూతక కాలం
సూతకం ఉదయం 6:25 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 3:20కి పట్టు స్నానం, నిమీలన్ (4:30), మధ్యకాలం (5:03), మునిమలన్ (5:32), మోక్షకాలం (6:47) దశలు జరుగుతాయి. ఆలయాలు మూసివేయబడతాయి. గ్రహణ కాలంలో గర్భిణులు, పిల్లలు బయటకు రాకూడదు. గ్రహణ శాంతి కోసం గంగాజల స్నానం, మహామృత్యుంజయ జపం, దానధర్మాలు చేయాలి. ఈ రోజు భోజనం, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
హోలీ పండుగపై ప్రభావం
గ్రహణ సూతకం కారణంగా మార్చి 3న రంగులాట, వేడుకలు నిషిద్ధం. దైవారాధనకు మాత్రమే రోజు కేటాయించాలి. పౌర్ణమి హోలీ ఉన్నా, దోష నివారణకు మార్చి 4న ఉత్సవాలు జరపడం శ్రేయస్కరం. ఈ మార్పు గ్రహణ దోషాన్ని తప్పించి పండుగ ఆనందాన్ని కాపాయం చేస్తుంది.
రాశి ఫలితాలు, పరిహారాలు
సింహరాశి వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు, మిథున, కన్య, ధనస్సు రాశులకు ఉద్రిక్తతలు రావచ్చు. మిగతా రాశులకు మిశ్ర ఫలాలు ఉంటాయి. చంద్ర శాంతి పూజ, గురువారం వ్రతం, తిల దానం. ధ్యానం, సానుకూల ఆలోచనలు పరిహారాలుగా సహాయపడతాయి.