Homeజాతీయ వార్తలుBihar Elections: బీహార్‌ ఎన్నికల్లో చరిత్రాత్మక మార్పులు.. ఆ మూడు చాలా కీలకం

Bihar Elections: బీహార్‌ ఎన్నికల్లో చరిత్రాత్మక మార్పులు.. ఆ మూడు చాలా కీలకం

Bihar Elections: బీహార్‌ అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ అమలు చేయని మూడు కీలక చర్యలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. అధికార, విపక్ష పార్టీలకు అభ్యంతరం చెప్పే వీలు లేకుండా, ఈ మార్పులు ఓట్ల క్రమబద్ధమైన లెక్కింపు, ఫేక్‌ ఓటింగ్‌ నిరోధానికి దోహదం చేయనున్నాయి.

నిరంతర వెబ్‌కాస్టింగ్‌
ఈసీ చేపట్టిన మూడు మూడు మార్పుల్లో మొదటిది ఇది. ప్రతీ పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్‌ ప్రారంభం నుంచి అంటే ఈవీఎంల స్టిక్కర్లు తొలగించి పోలింగ్‌ తర్వాత మళ్లీ ఈవీఎంలకు సీల్‌ వేసే వరకూ వెబ్‌కాస్టింగ్‌ జరుగుతుంది. నేరుగా ఈ ప్రసారం మానిటరింగ్‌ బృందాలకు చేరుతుంది. పోలింగ్‌ అనంతరం కూడా మానిటరింగ్‌పై సమగ్రంగా సంతకాలతో ధృవీకరణ ఉంటుంది. దీంతో రిగ్గింగ్, ఓట్ల దొంగతనం వంటి తప్పిదాలు తక్షణమే గుర్తించడం, నిరోధించడం సాధ్యం.

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు విధానంలో మార్పు
ఇక రెండో కీలక మార్పు ఇదీ.. ఇప్పటి వరకు ఈవీఎం ఓట్లు సరిచూసిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరిగేది. ఇకపై ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు పూర్తయి చివర్లో ఈవీఎం ఓట్ల చివరి రౌండ్‌ కౌంటింగ్‌ జరుగుతుంది. పోస్టల్‌ ఓట్లలో అవకతవకలకు అవకాశమే లేకుండా, ఫలితాలపై ప్రభావం జరగకుండా ఉంటుంది.

ముస్లిం మహిళా ఓటర్ల బుర్కా తొలగింపు..
మూడోది అత్యంత కీలకమైనది ఇది. బుర్కా ధరించి వచ్చే మహిళా ఓటర్ల గుర్తింపుపై ప్రతిసారి వివాదం జరుగుతోంది. మిగతా సందర్భాల్లో బుర్కా తొలగించేందుకు అభ్యంతరం చెప్పని ముస్లిం మహిళలు.. పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రం అభ్యంతరం చెబుతున్నారు. దీంతో ఈసారి అలాంట సమస్య ఉండకుండా ముస్లిం మహిళా ఓటర్ల బుర్కా తొలగించి ఓటర్‌ ఐడీ లేదా ఇతర గుర్తింపు కార్డుతో ముఖాన్ని పోల్చేందుకు అంగన్‌వాడీ మహిళలను నియమించారు. గుర్తింపు కార్డుతో ప్రత్యక్ష ముఖచిత్రం సరిపోలిన తర్వాతే ఓటు వేయాలని కొత్త విధానం. దీంతో ఫేక్‌ ఓటింగ్, ఐడెంటిటీ మోసాలను అరికట్టే అవకాశం ఉంది. ఇది బిహార్‌లో విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చు.

అదనపు చేర్పులు
– ఓటరు గుర్తింపు జాబితాలో అభ్యర్థుల ఫొటోలు బ్లాక్‌–అండ్‌–వైట్‌ స్థానంలో కలర్‌ రూపంలో ఉండనున్నాయి. దీనివల్ల గుర్తుపట్టడం సులభం.

ఈసీ తీసుకువచ్చిన 17 మార్పులు
ఈ విధానాలు విజయవంతమైతే, బీహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఓటర్ల నిజమైన హక్కులను రక్షించే కొత్త ఎన్నికల ప్రమాణంగా నిలుస్తాయి. ముఖ్యంగా నిరంతర వెబ్‌కాస్టింగ్, పోస్టల్‌ ఓట్ల క్రమబద్ధత, బుర్కా ధ్రువీకరణ ఇవి ఓటు ప్రక్రియలో పరివర్తనాత్మక మార్పులు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version