హైందవ సిద్ధాంతం.. బీజేపీ అస్త్రం

కొద్దిరోజులుగా బీజేపీ తన దూకుడును ప్రదర్శిస్తోంది. తన స్థావరమైన తామర కొలనులోకి నేతలను లాగేసుకుంటోంది. దీంతో ఇంతవరకు గంపగుత్తగా పడే మైనారిటీ ఓట్లను నమ్ముకుంటే చాలనుకునే రాజకీయ పార్టీలు తమ దారిని మార్చుకుంటున్నాయి. తామూ హైందవ అభిమానులమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు హిందువుల గురించి పెద్దగా పట్టించుకోని పలు పార్టీల నాయకులు ఇప్పుడు మతం జపం చేస్తున్నాయి. బీజేపీ విసిరిన మతవలలో చిక్కి విలవలలాడుతున్నాయి. తన ఎజెండాను అన్ని పార్టీల ఎజెండాగా మార్చుకుని బీజేపీ […]

Written By: Srinivas, Updated On : April 7, 2021 1:58 pm
Follow us on


కొద్దిరోజులుగా బీజేపీ తన దూకుడును ప్రదర్శిస్తోంది. తన స్థావరమైన తామర కొలనులోకి నేతలను లాగేసుకుంటోంది. దీంతో ఇంతవరకు గంపగుత్తగా పడే మైనారిటీ ఓట్లను నమ్ముకుంటే చాలనుకునే రాజకీయ పార్టీలు తమ దారిని మార్చుకుంటున్నాయి. తామూ హైందవ అభిమానులమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు హిందువుల గురించి పెద్దగా పట్టించుకోని పలు పార్టీల నాయకులు ఇప్పుడు మతం జపం చేస్తున్నాయి. బీజేపీ విసిరిన మతవలలో చిక్కి విలవలలాడుతున్నాయి. తన ఎజెండాను అన్ని పార్టీల ఎజెండాగా మార్చుకుని బీజేపీ సక్సెస్ అవుతోంది. మమతా బెనర్జీ తాను చండీమంత్రం చదవనిదే రోజూ ఇంటినుంచి అడుగు బయటపెట్టనని ప్రకటించారు. బీజేపీ నాయకులు సైతం అదే మాట అంటున్నారు.

ఒకప్పుడు మతం పేరు చెబితే.. వామపక్షాలు మండిపడుతుండేవి. మైనారిటీలను మాత్రం దువ్వుతుండేవి. పశ్చిమ బెంగాల్, కేరళలో అధికారంలో కొనసాగడానికి మైనారిటీ ఓట్లను కూడగట్టుకునేందుకే మొగ్గు చూపాయి. ఇప్పుడు మమతా అదే మంత్రం పటిస్తోంది. సీపీఐ, సీపీఎం కేరళాలో ఇంకా మచ్చిక చర్యలు కొనసాగిస్తూ ఫలితం రాబడుతోంది. కానీ ప్రజల్లో పెరుగుతున్న మత భావాలు.. పశ్చిమ బెంగాల్ లో దెబ్బతిన్న పరిస్థితులు గుర్తుకు వచ్చాయి. దీంతో కోర్టుతర్పుపై మౌనం వహించి సంప్రదాయాల్లో జోక్యం చేసుకోలేదు. ఇక తెలుగురాష్ట్రాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

ఎంతపిండికి అంతే రొట్టె చేయడంలో కాంగ్రెస్ నాయకులు ముందుంటారు. దశాబ్దాల కాలంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు ఆ పార్టీకి ఎంతో మేలు చేశాయి. ఈ బలాన్ని చూసుకుంటూ.. మెజారిటీ వర్గాలకు చెందిన ప్రజలను నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా బీజేపీ వంటి పార్టీ ఊపిరిపోసుకుని అత్యంత వేగంగా ప్రజల్లోకి వెళ్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు హిందూ జపం పఠిస్తున్నారు. రాహుల్ గాంధీ వచ్చాక శాశ్వతంగా పార్టీకి హిందువులు దూరం అయి పోతున్నారని అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. తాము హిందువులమని చెప్పుకునేందుకు రాహుల్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీన్ని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారా..? లేదా అన్నది సందేహమే.

2009నాటికి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక్క సీపీఎం మినహా తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి. అయితే రాష్ట్ర ఎజెండాను ముందుకు తీసుకొచ్చి సమస్య సాధన కోసం ముందుండి నడిచింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఆ పార్టీకి అప్పుడు ఇతర పార్టీల వారు తిరుగులేని బలాన్ని కల్పించారు. ఇప్పుడు తెలిసో, తెలియకో వెనకబడి పోతున్నామనే భయంతో బీజేపీ అజెండాను అన్ని పార్టీలు బుజాలపై మోస్తున్నాయి. ఇంతవరకు ఉదాసీనంగా ఉన్నామని పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. ఇది బీజేపీకి బలం చేకూరుస్తోంది.