‘ఎల్.జి’పై విచారణకు ఉన్నత స్థాయి కమిటి..!

విశాఖలో ఎల్.జి పాలిమర్స్ సంస్థలో విష వాయువు లీక్ దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు. పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.కమిటి సభ్యులుగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్,విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ సీపీ రాజీవ్ కుమార్ మీనా,కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ ఉన్నారు. విశాఖ ఘటనను తేలిగ్గా […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 3:50 pm
Follow us on


విశాఖలో ఎల్.జి పాలిమర్స్ సంస్థలో విష వాయువు లీక్ దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు. పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.కమిటి సభ్యులుగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్,విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ సీపీ రాజీవ్ కుమార్ మీనా,కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ ఉన్నారు.

విశాఖ ఘటనను తేలిగ్గా తీసుకోవద్దు…!

గ్యాస్ లీక్ ఘటనలో కంపెనీ నిర్లక్ష్యం ఎంతవరకూ ఉంది, యాదృచ్ఛికంగా జరిగిందా, లేక కావాలని చేసిందా అనే అంశాలను కమీటీ విచారణ చేయనుంది.

భవిష్యత్తులో ఎల్.జి పొలిమర్స్ వల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయనే అంశాలను కమిటీ పరిశీలిస్తోంది. కంపెనీ నిర్లక్ష్యం ఉందని తేలితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ సూచనలు చేస్తోంది.

గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!

ఈ మొత్తం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను సమర్పించనుంది. ఈ నివేదికను ఇచ్చేందుకు ప్రభుత్వం గడువు విధించింది. ఉత్తర్వులు వెలువడిన నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అదేశించింది.