విశాఖ ఘటనను తేలిగ్గా తీసుకోవద్దు…!

విశాఖ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు అవగాహన లేదు, ఆయన ఎవరు చెప్పినా వినడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ నుంచి జూమ్ యాప్ లో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి విశాఖపట్నంలో ఎవరైనా నిద్రపోయే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్యలో ఉన్న ఈ రసాయన పరిశ్రమను తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా! రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్ఘటనను […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 3:44 pm
Follow us on


విశాఖ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు అవగాహన లేదు, ఆయన ఎవరు చెప్పినా వినడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ నుంచి జూమ్ యాప్ లో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి విశాఖపట్నంలో ఎవరైనా నిద్రపోయే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్యలో ఉన్న ఈ రసాయన పరిశ్రమను తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా!

రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్ఘటనను తేలికగా తీసుకోవడం తగదన్నారు. హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా విచారణ చేపట్టడం, ఎం.జి.టి, జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టినట్లు చెప్పారు. ప్రధాని మోడీ స్పందించి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఈ ఘటనపై స్పందించిన తీరు అర్ధరహితంగా ఉందన్నారు. లాక్ డౌన్ అనంతరం పరిశ్రమ ప్రారంభించైనా విధానం సరిగా లేదన్నారు.
స్టైరిన్ గ్యాస్ ప్రభావం వల్ల భవిష్యత్ లో వచ్చే ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేయాలన్నారు.

గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!

విశాఖపట్నం వెళ్లేందుకు కేంద్రంలోని పలు విభాగాలకు అనుమతి కోరుతూ లేఖలు రాసినట్లు చెప్పారు. ఇంత వరకూ అనుమతి రాలేదన్నారు. టీడీపీ స్థానిక నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని సాయమందించాని అదేశించానని చెప్పారు. ఈ సంఘటనకు పరిశ్రమ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.