
తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన కరోనా పెషంట్ ఆ తర్వాత కన్పించకుండా పోవడం మిస్టరీగా మారింది. దీనిపై ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన సదరు పెషంట్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఆమె దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఆ కరోనా పెషంట్ విషయంలో అసలు ఏం జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అతడు బ్రతికి ఉన్నాడా? లేదా అనే విషయాన్ని జూన్ 5లోగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ఆ పెషంట్ మృతిచెందితే అంత్యక్రియలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని ఆదేశించింది.
ప్రభుత్వం చెబుతున్న వివరాలను బట్టి చూస్తే మధుసూధన్ అనే వ్యక్తి కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతడితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు చికిత్స అందించారు. కరోనా నుంచి కోలుకున్న మధుసూధన్ భార్య మాధవి కోలుకుంది. తన భర్త విషయంపై ఆరా తీయగా కోలుకుంటున్నాడని ఒకసారి చెప్పగా.. మరోసారి చనిపోయారని చెప్పినట్లు తెలుస్తోంది. మధుసూధన్ చనిపోతే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం అందించలేదనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. కనీసం డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని మాధవి ఆరోపించింది.
తన భర్త బ్రతికే ఉంటాడని మాధవి అంటోంది. ఈ విషయంపై గతంలోనే మంత్రి కేటీఆర్ కు ట్వీటర్లో ఫిర్యాదు చేసింది. తన భర్త చనిపోతే కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎలా అంత్యక్రియలు చేస్తారని ప్రశ్నించింది. డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకపోవడంపై కూడా నిలదీసింది. దీనిపై అఅధికారులు పొంతనలేని సమాధానం ఇస్తుండటంతో ఆమె హైక్టోర్టును ఆశ్రయింది. ఆ పెషెంట్ కు జీహెచ్ఎంసీ అధికారులు అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు చెప్పడంపై హైక్టోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి మాధవి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.
అయితే అధికారులు మాత్రం అప్పటికే ఆ కుటుంబంలో ఒకరు కరోనాతో మృతిచెందారని పేర్కొంటున్నారు. మధుసూదన్ కూడా చనిపోయాడని చెబితే ఆ కుటుంబం షాక్‌కు గురవుతుందనే చెప్పలేదని అంటున్నారు. డెడ్ బాడీని మార్చురీలో ఉంచే పరిస్థితి కూడా అప్పట్లో లేకపోవడంతో అంత్యక్రియలు చేసినట్లు చెబుతోన్నారు. వీరి వాదనలు విన్న హైకోర్టు జూన్ 5లోగా మధుసూధన్ విషయంలో అసలు ఏం జరిగిందో చెప్పాలని ఆదేశించింది. మధుసూధన్ చనిపోయాడా? లేక బ్రతికి ఉన్నాడా? తెలిపాలని పేర్కొంది. మృతిచెందింతే అతడి అంత్యక్రియలకు సంబంధించి ఆధారాలకు కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.