Homeజాతీయ వార్తలుకేసీఆర్ ప్రారంభోత్సవానికి హైకోర్ట్ బ్రేక్

కేసీఆర్ ప్రారంభోత్సవానికి హైకోర్ట్ బ్రేక్


ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ నెల 4న జరుపతలపెట్టిన సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌‌ ప్రారంభోత్సవానికి తెలంగాణ హై కోర్ట్ బ్రేక్ వేసింది.

హైకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారం వరకు ఉన్నా రైతుల్ని ముందే ఏప్రిల్ 30న రాత్రి 600 మంది పోలీసులతో వచ్చి బలవంతంగా ఖాళీ చేయించారని పిటీషనర్లు కొండపోచమ్మ రిజర్వాయర్‌‌ నిర్వాసితులు చెప్పడంతో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సడలింపుపై కేసీఆర్ వైఖరి!

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యిందని, ఈ నెల 4న సీఎం కేసీఆర్‌‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు వీలుగా నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను మే 7కి వాయిదా వేసింది.

బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి మే 6 లోగా తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా జడ్జిని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల, బైలంపూర్ గ్రామానికి చెందిన శ్యాంసుందర్‌‌రెడ్డి సహా 23 మంది ముంపు బాధిత రైతులు దాఖలు చేసిన రిట్లను హైకోర్టు శుక్రవారం మరోసారి విచారించింది.

లాక్‌డౌన్ తో కుప్పకూలుతున్న ప్రింట్ మీడియా

బాధితులను బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను బ్రిటీష్‌‌ రాణి ఏమీ నియమించలేదని, గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.

ఆంధ్ర పాలకులు అణిచివేతకు గురిచేశారని చెప్పి.. తెలంగాణను సాధించుకున్న తర్వాత కూడా రాష్ట్ర పాలకులు అదే ధోరణిని అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో వారిలాగే వ్యవహరిస్తే ఎలాగని నిలదీసింది.

వెయ్యిమంది పోలీసులు, 200 మంది అధికారులు, 500 మంది కూలీలు.. పదుల సంఖ్యలో అంబులెన్సులు యాబై డీసీఎంలు పదుల సంఖ్యలో జేసీబీలు, ప్రొక్లెయిన్లతో ఒక్కసారిగా కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలైన మామిడ్యాల, బైలంపూర్లపై పడ్డారు. జామర్లు పెట్టి సెల్ ఫోన్ సిగ్నల్ బ్లాక్ చేయడమే కాకుండా నిర్వాసితుల నుంచి సెల్ ఫోన్లు లాక్కున్నారు. ఇండ్లలో దొరికిన సామగ్రిని దొరికినట్టు బయటకు తరలించి డీసీఎంలలో వేశారు.

అడ్డుకోబోయిన వారిని ఎక్కడికక్కడే నిలువరించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి మొదలైన ఈ కూల్చివేతలు.. తరలింపు కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.

మామిడ్యాల, బైలంపూర్‌ ‌గ్రామాల నుంచి పరిహారం కోసం 53మంది కోర్టుకు వెళ్లారు. మే 1 వరకు ఖాళీ చేయవచ్చని కోర్టు వారికి సూచించింది. గడువు సమీపించడంతో అధికారులు బలవంతంగా నిర్వాసితులను ఇండ్ల నుంచి ఖాళీ చేయించారు. మామిడ్యాలలో 40, బైలంపూర్లో 13 ఇండ్ల తో పాటు ఇప్పటికే ఖాళీ చేసిన వాటిని సైతం కూల్చివేయడంతో ప్రస్తుతం అక్కడ మట్టిదిబ్బలే మిగిలాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper