Telangana: రాబోయే మూడు రోజులు.. తెలంగాణకు హెచ్చరిక

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఆగస్టు 16న పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాలను అప్రమత్తం చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే వీలుందని వివరించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, […]

Written By: Srinivas, Updated On : August 16, 2021 10:39 am
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఆగస్టు 16న పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాలను అప్రమత్తం చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే వీలుందని వివరించారు.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే వీలుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల నుంచి 48 గంటల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణపై నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15 ఆదివారం రాష్ర్టంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసినట్లు తెలిపారు. మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, సూర్యపేట జిల్లాలకు ఎల్లో ఆరంజ్ జారీ చేసినట్లు తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఒడిశా తీరంలో 3.6 కిలోమీటరల్ నుంచి 7 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. ఉత్తర చత్తీస్ గఢ్ లో మరో ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ర్టంలో రాబోయే మూడునాలుగు రోజులు వర్షాలు పడతాయని చెప్పింది.

హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్టం 23 డిగ్రీలుగా నమోదు కానుంది. అత్యధికంగా ఆదిలాబాద్ లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా భద్రాచలంలో 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 22 శాతం వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 482 మి.మీ నమోదైంది. ఇప్పటివరకు 4 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం 14 జిల్లాల్లో అధిక వర్షపాతం 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.