Chicken: వానలు వాళ్లకు మేలే చేశాయి.. ఊరంతా కోళ్లు దొరికాయి

Chicken: తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. దీంతో అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని చింతలూరు గ్రామంలో కోడికూర దావత్ చేసుకున్నారు. వర్షాలతో కిలోల చొప్పున డజన్ల కొద్దీ కోళ్లు పట్టుకెళ్లి పండుగ చేసుకున్నారు. ఉచితంగా కోళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? దీనికి ఓ కారణముంది. భారీ వర్షాలకు కుంటలు, చెరువులు నిండిపోయాయి. అలుగులు పారుతున్నాయి. జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు […]

Written By: Sekhar Katiki, Updated On : September 8, 2021 12:20 pm
Follow us on

Chicken: తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. దీంతో అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని చింతలూరు గ్రామంలో కోడికూర దావత్ చేసుకున్నారు. వర్షాలతో కిలోల చొప్పున డజన్ల కొద్దీ కోళ్లు పట్టుకెళ్లి పండుగ చేసుకున్నారు. ఉచితంగా కోళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? దీనికి ఓ కారణముంది.

భారీ వర్షాలకు కుంటలు, చెరువులు నిండిపోయాయి. అలుగులు పారుతున్నాయి. జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు దరకాసు చెరువు ఉప్పొంగింది. దీంతో మత్తడి పారుతోంది. చెరువు పక్కనే ఓ కోళ్ల ఫాం ఉంది. దీంతో కోళ్లఫాంలోకి నీరు ప్రవేశించడంతో నీట మునిగిపోయింది. ఫాంలోని కోళ్లన్ని వరద ప్రవాహంలోకి కొట్టుకుపోతుండడంతో ప్రజలందరు కోళ్లను తీసుకెళ్లిపోయారు. ఒక్కొక్కరు పది చొప్పున కోళ్లను తీసుకుని వెళ్లిపోయారు.

దీంతో ఊరంతా కోడి పండుగ చేసుకున్నారు. మాంసంతో విందు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు హల్ చల్ చేస్తున్నాయి. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుంటే మరోవైపు గ్రామస్తులు కోడికూరతో ఎంజాయ్ చేశారు. ఊరంతా ఎటు చూసినా కోడి కూరతో కమ్మనైన వంటకాలు చేసుకుని మరీ హల్ చల్ చేస్తున్నారు.

ఎవరి చేతిలో చూసినా కోళ్లే కనిపించాయి. చేతిలో కోళ్లు పట్టుకుని పరుగులు తీశారు. బిర్యానీ, కూరలు చేసుకుని మరీ తమ జిహ్వచాపల్యం తీర్చుకున్నారు. దీంతో ఊరు ప్రజలు కోడి కూరతో రుచిగా విందు ఆరగించారు. బంధువులను పిలిపించుకుని మరీ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో కూర్చుని భోజనాలు చేశారు. భారీ వర్షాలు ఇలా కోడి కూరను తినేలా చేసినందుకు మనసులోనే ఆనందం వ్యక్తం చేసుకున్నారు.