Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’.. అతనికి అన్యాయం చేస్తున్నాడా?

Bheemla Nayak : సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టార్ డ‌మ్ ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అలాంటి హీరోతో ఒక్క సినిమా చేయాల‌ని సంవ‌త్స‌రాలుగా ఎదురు చూస్తున్న‌వారు ఎంతో మంది ఉన్నారు. నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు చాలా మంది క్యూలో ఉన్నారు. కానీ.. అవ‌కాశం మాత్రం అంద‌రికీ ద‌క్క‌క‌పోవ‌చ్చు. అయితే.. ఊహించ‌ని విధంగా భీమ్లా నాయ‌క్ తో జాక్ పాట్ కొట్టేశాడు ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె. చంద్ర‌. దీంతో.. గాల్లో తేలిపోయాడు ద‌ర్శ‌కుడు. అయితే.. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తున్న‌వారంతా అత‌డికి […]

Written By: Bhaskar, Updated On : September 8, 2021 12:03 pm
Follow us on

Bheemla Nayak : సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టార్ డ‌మ్ ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అలాంటి హీరోతో ఒక్క సినిమా చేయాల‌ని సంవ‌త్స‌రాలుగా ఎదురు చూస్తున్న‌వారు ఎంతో మంది ఉన్నారు. నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు చాలా మంది క్యూలో ఉన్నారు. కానీ.. అవ‌కాశం మాత్రం అంద‌రికీ ద‌క్క‌క‌పోవ‌చ్చు. అయితే.. ఊహించ‌ని విధంగా భీమ్లా నాయ‌క్ తో జాక్ పాట్ కొట్టేశాడు ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె. చంద్ర‌. దీంతో.. గాల్లో తేలిపోయాడు ద‌ర్శ‌కుడు. అయితే.. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తున్న‌వారంతా అత‌డికి అన్యాయం జ‌రుగుతోందా? అనే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన‌ప్పుడు కూడా ఇలాంటి డిస్క‌ష‌నే కొన‌సాగింది. మ‌ల్టీ స్టార‌ర్ మూవీగా ప్ర‌క‌టించిన భీమ్లా నాయ‌క్ లో.. కేవ‌లం ప‌వ‌ర్ స్టార్ ను మాత్ర‌మే చూపించార‌నే చ‌ర్చ న‌డిచింది. అంతేకాదు.. సినిమాలో రానా పాత్ర‌ను కూడా త‌గ్గించార‌నే పుకార్లు కూడా గట్టిగానే షికారు చేస్తున్నాయి. ఇక‌, ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సింగిల్ లో మొత్తం.. ప‌వ‌న్ ను పైకి లేపుతూనే సాగింది. అయితే.. రానా కోసం స్పెష‌ల్ టీజ‌ర్ సిద్ధ‌మ‌వుతోందంటూ కొంద‌రు చెబుతున్నారు. మొత్తానికి ఈ విష‌యంలో డిస్క‌ష‌న్ అయితే న‌డించింది.

ఇక‌, ఇంత‌క‌న్నా ముందు నుంచీ సాగుతున్న వివాదం ఏమంటే.. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె.చంద్ర‌ను తొక్కేస్తున్నార‌ని! అవును.. ఈ చిత్రానికి సాగ‌ర్ ద‌ర్శ‌కుడు. అయితే.. ప‌వ‌న్ మిత్రుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇక్క‌డే వ‌చ్చింది చిక్కంతా! ద‌ర్శ‌కుడిక‌న్నా ఎక్కువ‌గా త్రివిక్ర‌మ్ గురించిన చ‌ర్చే సాగుతోంది. త్రివిక్ర‌మ్ సాగ‌ర్ ను మింగేస్తున్నాడ‌నే టాక్ గ‌ట్టిగానే వినిపిస్తోంది.

మాట‌లు అందించే టెక్నీషియ‌న్ కు ద‌ర్శ‌కుడి క‌న్నా ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌డ‌మేంట‌న్న‌ది ప‌లువురు ఆడియ‌న్స్ కంప్లైంట్‌. ఈ చిత్రంలో ప‌వ‌న్ కోసం అడిష‌న‌ల్ గా కొన్ని సీన్స్ యాడ్ చేశార‌ని, అదంతా త్రివిక్ర‌మ్ ఆధ్వ‌ర్యంలోనే సాగింద‌ని భోగ‌ట్టా. ఇలాంటి ప్ర‌చారం నేప‌థ్యంలో.. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌ను ఉత్స‌వ విగ్ర‌హంలా మార్చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాకు మంచి పాజిటివ్ టాకే వస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ కు, పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ అందుకున్న పాటగా భీమ్లా నాయక్ సాంగ్ రికార్డు నమోదు చేసింది. సంక్రాంతికి స్లాట్ బుక్ చేసుకున్న ఈ మూవీ అంత‌కంత‌కూ క్యూరియాసిటీ ఫిల్ చేస్తోంది. ఇదంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ద‌ర్శ‌కుడికి అన్యాయం జ‌రుగుతోంద‌న్న అప‌వాదు కూడా వేసుకుంటోంది. మ‌రి, ఏం జ‌రుగుతుంది? సాగర్ కు ఎలాంటి క్రెడిట్ ద‌క్కుతుంది? అన్న‌ది చూడాలి.