TS Rains Effect: తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. వారం రోజులుగా కనీసం విరామం కూడా లేకుండా ఒకటే దంచుడు దంచుతున్నాయి. దీంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు, వంకలు పరుగులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో వరుణుడి దెబ్బకు అందరు కుదేలవుతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనీయడం లేదు.

దీంతో జనజీవనం స్తంభించింది. వ్యాపారాలు సాగడం లేదు. వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోంది. పంట చేలలో కలుపు తీయకపోవడంతో పంటలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ వానలు ఇంకా ఎన్ని రోజులు పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. అవి నేటితో ముగుస్తున్నాయి. దీంతో మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Suryakumar Yadav: టీమిండియా క్రికెటర్ ‘సూర్య’ప్రతాపానికి అసలు కారణం అదేనట?
రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గడం లేదు. ఒకటే కుండపోత వర్షం పడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వరదలు పొంచి ఉన్నందున పాఠశాలలకు మూడు రోజులు అంటే గురు, శుక్ర, శని వారాలు కూడా సెలవులు మంజూరు చేసింది. ఇప్పటికే జరగాల్సిన పరీక్షలను కూడా రద్దు చేసింది. వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఎంసెట్ పరీక్షలపై మాత్రం సందిగ్ధత నెలకొంది. పరీక్షలు నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనేదానిపై స్పష్టమైన ప్రకటన కనిపించడం లేదు. దీంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనేది తెలియడం లేదు. జులై 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ మాత్రం యథాతథంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పరీక్ష సమయాల్లో కూడా మార్పులు ఉండవని చెబుతున్నారు. జులై 14, 15 తేదీల్లో నిర్వహించే ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష మాత్రం వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:Visakhapatnam- CM Jagan: జగన్ బిచాణా ఎత్తేస్తున్నాడా? పాలన ఇక అక్కడ నుంచే?
[…] Also Read: TS Rains Effect: భారీవర్షాలు.. తెలంగాణ సీఎం కేసీ… […]