https://oktelugu.com/

న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్‌పై కేంద్రం నజర్‌‌

ఇప్పటికే దేశాన్ని కరోనా దెబ్బతీసింది. ఇక ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్‌ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం అలర్ట్‌ అయింది. ఇందులో భాగంగా మరికొద్ది గంటల్లో జరగబోతున్న న్యూ ఇయర్‌‌ వేడుకలపై దృష్టి సారించింది. న్యూ ఇయర్‌‌ వేడుకల పేరుతో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండడంతో గట్టి నిఘా పెట్టాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. Also Read: ప్రపంచ మెడికల్ హబ్ గా ఇండియా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2020 / 03:27 PM IST
    Follow us on


    ఇప్పటికే దేశాన్ని కరోనా దెబ్బతీసింది. ఇక ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్‌ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం అలర్ట్‌ అయింది. ఇందులో భాగంగా మరికొద్ది గంటల్లో జరగబోతున్న న్యూ ఇయర్‌‌ వేడుకలపై దృష్టి సారించింది. న్యూ ఇయర్‌‌ వేడుకల పేరుతో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండడంతో గట్టి నిఘా పెట్టాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు.

    Also Read: ప్రపంచ మెడికల్ హబ్ గా ఇండియా మారబోతుందా?

    ఎక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని సూచించింది. కరోనా‌ ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వుల్లోని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రాలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మహమ్మారి‌ వ్యాప్తి నివారణకు రాత్రి కర్ఫ్యూలాంటి స్థానిక ఆంక్షలు విధించుకోవచ్చని పేర్కొన్నారు.

    వ్యక్తులు.. వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు రాజేష్‌ భూషణ్‌ రాష్ట్రాలకు గుర్తుచేశారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని డిసెంబర్‌ 31తోపాటు, జనవరి 15నాడు కూడా తగిన ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.

    Also Read: రైతు చట్టాలకు వ్యతిరేకించిన సీఎం విజయన్..!

    కేంద్రం జాగ్రత్త అంటూ ఆదేశాలిస్తుంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైన్స్‌లు, పబ్‌లకు టైమింగ్స్‌ పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల ప్రాణాల కన్నా ఖజానా మీదనే దృష్టి సారించిందని పలువురు అంటున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్