TDP and Janasena: ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు మారుతున్నాయి. ఇన్నాళ్లు బీజేపీతో జట్టుకట్టిన జనసేన ప్రస్తుతం దాని నుంచి దూరంగా వెళ్లాలని భావిస్తోంది. టీడీపీతో జత కట్టాలని భావిస్తోంది. వైసీపీని ఎదుర్కొనే క్రమంలో టీడీపీతో నైతనే పట్టు బాగా ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీకి దగ్గరయ్యేందుకు పలు మార్గాలు వెతుకుతున్నారని సమాచారం. బీజేపీతో విడిపోవడానికి పలు కారణాలు అన్వేషిస్తున్నారు. ఇన్ని రోజులు బీజేపీతో పొత్తు ఉన్నా ఎక్కడ కూడా రెండు పార్టీలు కలిసి పోరాడిన సందర్భాలు కనిపించలేదు. దీంతో వారిలో పొత్తు కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చాయి.

పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుకు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సంబంధాల మెరుగు కోసం ఇరు పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టాలంటే జనసేన, టీడీపీ పొత్తు అనివార్యమనే ఆలోచనకు రెండు పార్టీలు వచ్చినట్లు సమాచారం. దీంతోనే వారి మధ్య సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను పొత్తు పెట్టుకోవాలని సిద్ధమైనట్లు రెండు పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఒకరిని పవన్ కల్యాణ్ తో మాట్లాడి సంబంధాలు కలిపేందుకు నియమించినట్లు సమాచారం. ఆయన ద్వారానే జనసేన, టీడీపీ సంబంధాల మెరుగుపరచుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఇప్పటికే పొత్తుల కోసం పలు పార్టీలు మారిన సందర్భంలో ఆయనపై ఉన్న అపవాదు దృష్ట్యా మరోసారి పొత్తు కోసం పార్టీని మార్చడంతో ప్రజల్లో చులకన అయిపోతామనే భావంతో సరైన కారణాలు చూపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం తదితర కారణాలతో బీజేపీతో విడిపోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని మరోసారి రాష్ర్టంలో అధికారం చేజిక్కించుకోవాలని జనసేన పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీతో జట్టు కోసం సిద్ధమైనట్లు చెబుతున్నారు. దీనికి గాను ఓ కాపు ఎమ్మెల్యే ఒకరిని పవన్ కల్యాణ్ తో చర్చించేందుకు పంపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ర్టంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో జనసేన టీడీపీతో జట్టు కట్టి రాజకీయాలను శాసించాలని ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.