HDFC scheme : హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ప్లాన్లో ప్రతి నెల కేవలం రూ.1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోట్లు కురిపిస్తుంది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ప్లాన్ లో మీరు కాంపౌండింగ్ పవర్ మ్యాజిక్ చూడవచ్చు. ఈ ప్లాన్ లో ఒకేసారి చేతికి ఐదు కోట్లు అందించింది. ఒకేసారి ఇందులో కేవలం లక్ష రూపాయలు పెట్టిన వారికి 195 రెట్లు లాభాలను అందించింది. భవిష్యత్తులో రాబోయే ఖర్చులను ఎదురుకోవడానికి ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలని ప్రతి ఒక్కరికి ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే భవిష్యత్తులో మంచి రాబడి పొందడానికి కొంచెం రిస్కు కూడా తీసుకోవాలి. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అని భావించేవారు మ్యూచువల్ ఫండ్ల లో అలాగే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత చరిత్రను మీరు పరిశీలించినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న చాలా రకాలు దీర్ఘకాలంలో హై రిటర్న్స్ ను అందిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ తమ పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా కూడా మార్చాయి. కోటీశ్వరులుగా మార్చే ఒక ఫండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీము పేరు హెచ్డీఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్.
ఇది దీర్ఘకాలంతోపాటు స్వల్ప కాలంలో కూడా పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందిస్తుంది. గత ఏడాది కాలంలో మీరు చూసుకున్నట్లయితే ఈ ఫండ్ 15.69% రిటర్న్స్ పెట్టుబడిదారులకు అందించింది. 500 టి.ఆర్ 8.54 తో పోల్చినట్లయితే బెంచ్ మార్క్ ఇండెక్స్ రెండింతలు లాభాలను అందించింది. జనవరి, 1995లో మ్యూచువల్ ఫండ్స్ ఈ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ఫండ్ టు అత్యధికంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వబడింది. దీని సగటున వార్షిక రాబడి 18.91 శాతం గా ఉందని తెలుస్తుంది. ఇది ఫ్లెక్సీ క్యాప్ కావడంతో అన్ని రంగాలలో కూడా ఇది పెట్టుబడి చేసే అవకాశం ఉంటుంది.
ఈ ఫ్లెక్సీ క్యాప్ లాడ్జి క్యాప్, మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ స్టాక్ లలో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఇది పెట్టుబడులను మార్చేందుకు చాలా వీలుగా ఉంటుంది. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ఇది మేనేజర్లకు రీ బ్యాలెన్స్ చేసేందుకు అవకాశం కూడా కల్పిస్తుంది. గత మూడు ఏళ్ల నుంచి ఈ ఫండ్ లో వార్షిక రాబడి 24.95 శాతంగా ఉందని సమాచారం. అప్పట్లో ఈ ప్లాన్ లో లక్ష రూపాయలు పెట్టి వదిలేసిన వారికి ఇప్పుడు అవి రూ.1.95 కోట్లుగా చేతికి అందాయి.
Also Read : గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో భారత్ దూకుడు.. టాప్ 10లో నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్