FD Interest Rate Revision : ఈ బ్యాంకులు తమ బ్యాంకులో ఉన్న మూడు కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్ లపై ఉన్న వడ్డీ రేటులను సవరించాయి. నిర్దిష్ట కాల పరిమిత పై ఈ రెండు బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించాయి. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దీర్ఘకాలిక డిపాజిట్ లపై వడ్డీరేట్లను పెంచినట్లు ప్రకటించింది. సాధారణ కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై కెనరా బ్యాంకు నాలుగు శాతం నుంచి ఏడు శాతం అలాగే సీనియర్ సిటిజన్స్ కి ఫిక్స్డ్ డిపాజిట్లపై నాలుగు శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీరేట్లు అందిస్తుంది. జూన్ 1, 2025 నుంచి కెనరా బ్యాంక్ వీటిలో కొన్ని సవరణలను చేసింది. ఏడాది కాల పరిమితికి కెనరా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేటును 10 బేసిక్ పాయింట్లను తగ్గించింది. దాంతో ప్రస్తుతం ఎఫ్బి లపై వడ్డీ రేట్లు 6.85% నుంచి 6.75 శాతానికి తగ్గాయి.
మూడు ఏళ్ళు అంతకంటే ఎక్కువ అలాగే ఐదు ఏళ్ళు అంత కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల కాల పరిమితికి కెనరా బ్యాంక్ వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.75 శాతం కి 25 బేసిక్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. మరోవైపు మూడు కోట్ల లోపు ఉన్న రిటైల్ డిపాజిట్ లపై పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా వడ్డీ రేటులను సవరిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1, 2025 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించిన కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. సాధారణ పౌరులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల కాల పరిమితికి 3.50 శాతం నుంచి 6.90 మధ్యాహ్న ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లు అందిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 6.90% 390 రోజుల కాలపరిమితిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందిస్తుంది. గతంలో కూడా ఈ కాలపరిమితికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం వడ్డీ రేటును అందించేది.
ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ఏడాది నుంచి 390 రోజుల కాలపరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేటును పది బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉన్న 390 రోజులో కాలపరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును 7% నుంచి 6.90 శాతానికి సవరించింది. అలాగే 391 రోజుల నుంచి 505 రోజుల కాలపరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై 6.80% నుంచి 6.70 శాతానికి వడ్డీ రేటును సవరించింది. ఇక 506 రోజుల కాల పరిమితి పై వడ్డీ రేటును 6.70 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గించింది. 57 రోజులు నుంచి రెండేళ్లు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ కాల పరిమితిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేటును 6.80% నుంచి 6.70 శాతానికి తగ్గిస్తున్నట్లు సవరణలు జారీ చేసింది.