https://oktelugu.com/

ఆనందయ్య మందుపై విచారణకు హైకోర్టు ఓకే

కృష్ణపట్నంలో ఆనందయ్య అందజేసే నాటు మందుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మందు నాణ్యత ఉందని కొందరు, దానితో ప్రయోజనం లేదని ఇంకొందరు, అసలు వాడలేదని మరికొందరు పొంతన లేని సమాధానాలు చెబుతున్న క్రమంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆనందయ్య అందజేసే మందు మంచిదేనని పలువురు తేల్చారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏ రకమైన ప్రకటన చేయలేదు. టీడీపీ ప్రతినిధుల బృందం మంగళవారం కృష్ణపట్నంలో పర్యటించి ఆనందయ్య మందును పరిశీలించింది. మందు పంపిణీ చేయాలని […]

Written By: , Updated On : May 26, 2021 / 04:30 PM IST
Follow us on

AP
కృష్ణపట్నంలో ఆనందయ్య అందజేసే నాటు మందుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మందు నాణ్యత ఉందని కొందరు, దానితో ప్రయోజనం లేదని ఇంకొందరు, అసలు వాడలేదని మరికొందరు పొంతన లేని సమాధానాలు చెబుతున్న క్రమంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆనందయ్య అందజేసే మందు మంచిదేనని పలువురు తేల్చారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏ రకమైన ప్రకటన చేయలేదు.

టీడీపీ ప్రతినిధుల బృందం మంగళవారం కృష్ణపట్నంలో పర్యటించి ఆనందయ్య మందును పరిశీలించింది. మందు పంపిణీ చేయాలని సూచించింది. దీంతో అందరూ అంగీకరించినా ఆయుర్వేద సంస్థలు, ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావడం లేదు. ఆనందయ్య అందించే మందుపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో ఆయన మందు పంపిణీపై ఇప్పటికే పలు కోణాల్లో పలువురు స్పందిస్తున్నారు.

ఆనందయ్య మందుపై విచారణకు హైకోర్టు అనుమతించింది. దీంతో మందు పంపిణీపై విచారణ చేపట్టనుంది. గురువారం నుంచి విచారణ జరగనుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి ఆనందయ్య మందు పంపిణీపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

లోకాయుక్త ఆదేశంతో మందు పంపిణీ నిలిపివేసినట్లు తెలిసింది. మందు పంపిణీతో జరిగే అనర్థాలపై పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదని మందు పంపిణీ ఆపాలని ఆదేశాలు ఇవ్వలేదని పిటిషనర్లు చెబుతున్నారు. కరోనాతో బాధపడుతున్న వారికి హఠాత్తుగా మందు పంపిణీ నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నారని దీనిపై విచారణ చేపట్టాలని కోరారు.