https://oktelugu.com/

Rahul Gandhi: మార్షల్ ఆర్ట్స్ లో రాహుల్ గాంధీ ప్రతిభ చూశారా? ప్రత్యర్థిని ఏ స్థాయిలో మట్టి కరిపించారంటే?

గురువారం దేశం మొత్తం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకున్నది. ధ్యాన్ చంద్ చిత్రపటాలకు నివాళులు వేసి, క్రీడారంగం ఉన్నతికి పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేసింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా లోక్ సభ లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ సరికొత్త అవతారంలో కనిపించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 29, 2024 / 06:07 PM IST

    Rahul Gandhi(1)

    Follow us on

    Rahul Gandhi: ట్విట్టర్ ఎక్స్ లో రాహుల్ గాంధీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ లో కిటుకులు నేర్చుకున్నట్టు కనిపించాడు. దానికి సంబంధించిన వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.. రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ లో జియు – జిట్సు అనే నైపుణ్యాన్ని ఉపయోగించి తన ప్రత్యర్థిని మట్టి కరిపించాడు.. ఈ వీడియోను పోస్ట్ చేసి దేశంలోని క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు రాహుల్ గాంధీ తెలియజేశాడు.. రాహుల్ గాంధీ ఇలా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో యావత్ క్రీడాకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారు కూడా తమ తమ స్థాయిలో వీడియోలను పోస్ట్ చేస్తూ ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ గెటప్ లో కనిపించడం పట్ల ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఈ గెటప్ బాగుందని కితాబిస్తున్నారు.

    అప్పుడు ఓడిపోయినప్పటికీ

    2014, 19 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో సరికొత్త విధానాన్ని అలవర్చుకున్నారు. ఇందులో భాగంగా జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టారు. ఆ తర్వాత మణిపూర్ నుంచి గుజరాత్ వరకు యాత్ర నిర్వహించారు.. రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించిన ప్రాంతాలలో పార్లమెంట్ స్థానాలు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. తెలంగాణలో జోడోయాత్ర చేపడితే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది.. జోడో యాత్ర చేస్తున్నప్పుడు దేశంలోని అన్ని వర్గాల ప్రజలను రాహుల్ గాంధీ కలుసుకున్నారు. ఆ సందర్భంగా వివిధ రకాల వీడియోలను ఆయన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు.

    ఆ వీడియో అప్పటిదే

    రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన మార్షల్ ఆర్ట్స్ వీడియో భారత్ జోడో న్యాయ్ యాత్ర నాటిదని తెలుస్తోంది. అప్పుడు యాత్ర నిర్వహిస్తున్నప్పుడు ఒకరోజు సాయంత్రం తన శిబిరంలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేశారు.. జియు – జిట్సు నైపుణ్యం నేర్చుకున్నారు. ” యువత హింసను వదిలిపెట్టాలి. శాంతిని పెంచుకోవాలి.. అదే దేశానికి విలువను కలిగిస్తుంది. యువత అలా నడుచుకోవడమే ధ్యాన్ చంద్ కు అసలైన నివాళి అని” రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా, ఈ జియు జిట్సు అనేది బ్రెజిల్ దేశంలో మార్షల్ ఆర్ట్. పట్టుకోవడం ద్వారానే ప్రత్యర్థిని నియంత్రించడం ఇందులో ప్రత్యేకత. దీనిని బీజేజే అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ఏ మాత్రం ప్రత్యర్థికి దెబ్బ తగిలే అవకాశం ఉండదు. నట్టు రాహుల్ గాంధీ జియు జిట్సు లో బ్లాక్ బెల్ట్ హోల్డర్.