హత్రాస్ ఘటన: నిందితులకు బాసటగా అగ్రవర్ణాలు?

యూపీలో హత్రాస్ యువతి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. దళిత యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేయడంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. యువతీని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్పించగా సెప్టెంబర్ 29న మృతిచెందింది. బాధిత కుటుంబ సభ్యులు లేకుండానే అర్ధరాత్రి పోలీసులు హడావుడిగా యువతి శవానికి అంత్యక్రియలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. Also Read: తొలగిన ‘పొత్తు’ అనిశ్చితి.. కొలిక్కివచ్చిన సీట్లు ఈ అత్యాచార సంఘటన కాస్తా యూపీలో రాజకీయ రంగు పులుముకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య […]

Written By: NARESH, Updated On : October 4, 2020 6:49 pm
Follow us on

యూపీలో హత్రాస్ యువతి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. దళిత యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేయడంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. యువతీని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్పించగా సెప్టెంబర్ 29న మృతిచెందింది. బాధిత కుటుంబ సభ్యులు లేకుండానే అర్ధరాత్రి పోలీసులు హడావుడిగా యువతి శవానికి అంత్యక్రియలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.

Also Read: తొలగిన ‘పొత్తు’ అనిశ్చితి.. కొలిక్కివచ్చిన సీట్లు

ఈ అత్యాచార సంఘటన కాస్తా యూపీలో రాజకీయ రంగు పులుముకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. హత్రాస్ ఘటనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఘాటుగా స్పందించారు. దళితులను అణచివేసేందుకే ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆరోపించారు. రాహుల్.. ప్రియాంకలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు యూపీకి వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో యూపీ సర్కార్ వెనక్కి తగ్గింది.

అయితే హత్రాస్ ఘటనలో జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించడం సంచలనంగా మారింది. హత్రాస్ ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయగా వారికి మద్దతుగా అగ్రవర్ణాల వారు ఆదివారం సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్థానిక బీజేపీ నేత రాజ్‌వీర్ సింగ్ పెహెల్వార్ ఇంటిలో ఈ సమావేశం జరుగగా నిందితుల్లో ఒకరి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ భేటిలో అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి తమ వర్గానికి చెందిన వారిపై తప్పుడు కేసులు పెట్టారని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. నిందితులపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ విన్పిస్తోంది. అయితే బాధిత కుటుంబ సభ్యులపై ఎటువంటి ఒత్తిడి లేదని.. ఒకేసారి ఐదుగురు రాజకీయ నేతలు వారిని కలుసుకునేందుకు అనుమతి ఇస్తామని కలెక్టర్ చెబుతున్నారు.

Also Read: మారటోరియంలోనూ లోన్లు కట్టారా..! : మీకో శుభవార్త

అయితే కలెక్టర్ సైతం నిందితుల పక్షాన మాట్లాడేవారికి మద్దతు ఇస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కేసును అందరూ కలిసి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హత్రాస్ ఘటనను విపక్షాలు నిర్భయ ఘటనతో పోలుస్తుండటంతో యూపీ సర్కార్ వీలైనంత త్వరగా ఈ కేసుకు పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఈ కేసులో సర్కార్ దూకుడు చేస్తుంటే బాధితులకు న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు మాత్రం సర్వత్రా కలుగుతున్నాయి.