ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య దేశాన్ని కుదిపేసింది. ఈ కేసును గతంలో సీబీఐకి అప్పగిస్తున్నట్టు యూపీ సీఎం యోగి ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణను వేగవంతంగా ముగించింది. హత్రాస్ జిల్లాలో అగ్రవర్ణాలంతా ఒక్కటి కావడంతో కేసు విచారణ డైవర్ట్ కాకుండా సీబీఐ విచారణ జరుపుతోంది.
Also Read: ట్రంప్ జోలికి వెళ్లే సత్తా బైడెన్ కు ఉందా..!
హత్రాస్ బాలిక హత్యాచారం విషయంలో యూపీ పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దళిత బాలిక శవాన్ని ఆమె కుటుంబాన్ని అనుమతించకుండా అర్ధరాత్రి పోలీసులు దహనం చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహం.. నిరసనలు వ్యక్తమయ్యాయి. అన్ని వైపుల నుండి తీవ్ర విమర్శలు.. ఒత్తిడిని ఎదుర్కొంటున్న యుపి ప్రభుత్వం దర్యాప్తును సిబిఐ సిఫారసు చేయవలసి వచ్చింది. దళిత బాలిక కేసు విషయంలో యుపి పోలీసులు వ్యవహరించిన తీరుతో విమర్శలు చెలరేగడంతో వారి చేతుల్లో విచారణ కరెక్ట్ కాదని యూపీ సర్కార్ సీబీఐకి ఈ కేసును బదలాయించింది.
యుపీ పోలీసులు కూడా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం వివాదాస్పదమైంది. ప్రభుత్వాన్ని కించపరచడానికి ప్రయత్నించిన తెలియని వ్యక్తులపై కేసులు పెట్టడం దుమారం రేపింది.. ఇప్పుడు, సిబిఐ ఈ కేసును పోలీసు శాఖ నుండి తీసుకుంది. విచారణ ప్రారంభించింది.
Also Read: న్యూఇయర్ వేడుకలపై బ్యాన్ విధించిన కర్ణాటక.. ఎందుకంటే?
20 ఏళ్ల దళిత బాలికపై సెప్టెంబర్ 14 న నలుగురు యువకులు అత్యాచారం చేశారు. రెండు వారాల చికిత్స తర్వాత తీవ్రమైన గాయాల కారణంగా ఆమె మరణించింది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది.
సీబీఐ అధికారులు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. అత్యాచారం అనంతరం ట్రీట్ మెంట్ చేసిన.. పోస్టుమార్టం రిపోర్టులను విశ్లేషించారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలం నమోదును తీసుకున్నారు. తాజాగా అత్యాచారం చేశారని చార్జీషీటులో దాఖలు చేశారు.
ఈ కేసులో సీబీఐ ఈరోజు చార్జిషీట్ దాఖలు చేసింది. 19 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని సీబీఐ చార్జిషీట్ లో పేర్కొంది. నలుగురు నిందితులపై అత్యాచారం, హత్య అభియోగాలను మోపింది. ఈ మేరకు నలుగురిపై స్థానిక కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్