హిందూత్వం పేరుతో రాజకీయాలు చేయడానికి ఏమాత్రం మొహమాట పడదు బీజేపీ. కానీ మిగతా పార్టీలు అలా కాదు. అందులోనూ ఏపీలో మతతత్వ రాజకీయాలకు చోటే లేదు. కులాల వారీగా ఓట్లు చీల్చాలని చూస్తారు తప్ప.. ఇలా మత రాజకీయాలు ఎప్పుడూ కనిపించలేదు. ఇక పవన్ కల్యాణ్ విషయానికొస్తే.. తనది రెల్లి కులం అని, తనది సర్వమత సమ్మేళనం అని గతంలో చెప్పేవారు. కానీ.. ఇప్పుడు పూర్తిగా బీజేపీ ట్రాప్‌లో పడిపోయినట్లే అర్థమవుతోంది.
Also Read: నేడు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
కమలానికి రాసుకున్న బుదర మొత్తం తను అంటించుకోవాలని చూస్తున్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై సీబీఐ ఎంక్వయిరీ కోరడం వరకు పర్లేదు. అక్కడితో ఆగకుండా.. తిరుమల కొండపై నుంచి మంత్రులు సీఎం జగన్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పారంటూ పెడర్ధాలు తీయడమే మరీ విడ్డూరం.
ఇన్నాళ్లు అన్ని కులమతాలను గౌరవించారు పవన్. కానీ.. కొత్తగా ఇప్పుడు మత రాజకీయాలను తెరమీదకు తేవడం చర్చకు దారితీసింది. దీంతో ఇప్పుడు అభిమానులంతా జనసేనానిని చీత్కరిస్తున్నారు. తిరుమల కొండపై నిలబడి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడంలో పవన్ కి కనిపించిన తప్పు ఏంటని అడుగుతున్నారు. తాను తీసిన జానీ సినిమాలో పరమత సహనం బోధిస్తూ పాట పెట్టుకున్న పవన్‌కు, ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పవన్‌కు చాలా తేడా ఉందని గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: ఎల్‌ఆర్‌ఎస్ లేకున్నా బిల్డింగ్ కట్టుకోవచ్చు.. అదెలా అంటే..?
ఇప్పటికే తన వ్యవహార శైలితో చాలా మందిని దూరం చేసుకున్నాడు పవన్. తాజాగా.. మతపరమైన చిక్కులో చిక్కుకుంటూ మరింత దిగజారిపోతున్నారు. చంద్రబాబుతో చేరినన్ని రోజులు వ్యక్తిగతంగా పతనం అయిన పవన్, ఇప్పుడు బీజేపీతో అంటకాగుతూ నైతికంగా కూడా పతనం అంచుకు చేరుకుంటున్నారు. జనసేనాని కాస్త మత సేనానిగా మిగిలిపోవద్దని అభిమానులు సైతం కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్