https://oktelugu.com/

Huzurabad bypoll: తెలంగాణలో హుజూరాబాద్ హీట్ తగ్గిపోయిందా?

Huzurabad bypoll: హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి తగ్గిపోయింది. రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టడం లేదు. ఇన్నాళ్లు ఉప ఎన్నిక సెప్టెంబర్ లోనే జరుగుతుందని భావించి అందరు విరివిగా ప్రచారం చేసినా ఎన్నిక ప్రస్తుతం ఉండదని తెలియడంతో నేతల్లో ఉత్సాహం సన్నగిల్లింది. నవంబర్ లేదా డిసెంబర్ లో ఉంటుందని తెలియడంతో అన్ని పార్టీలు హడావిడి చేయడం లేదు. వీలైనంత వరకు ప్రచారం తగ్గించుకుని తమదైన శైలిలో వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 15, 2021 / 09:59 AM IST
    Follow us on

    Huzurabad bypoll: హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి తగ్గిపోయింది. రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టడం లేదు. ఇన్నాళ్లు ఉప ఎన్నిక సెప్టెంబర్ లోనే జరుగుతుందని భావించి అందరు విరివిగా ప్రచారం చేసినా ఎన్నిక ప్రస్తుతం ఉండదని తెలియడంతో నేతల్లో ఉత్సాహం సన్నగిల్లింది. నవంబర్ లేదా డిసెంబర్ లో ఉంటుందని తెలియడంతో అన్ని పార్టీలు హడావిడి చేయడం లేదు. వీలైనంత వరకు ప్రచారం తగ్గించుకుని తమదైన శైలిలో వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రచారం చేయడానికి సిద్దపడడం లేదు.

    మరోపక్క టీఆర్ఎస్ బీజేపీని కట్టడి చేయాలనే ఉద్దేశంతో దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో ప్రారంభించి ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోంది. దీనిపై బీజేపీ కూడా అంతే స్థాయిలో విమర్శలు చేస్తూ అదంతా వట్టిదే అని కొట్టిపారేస్తోంది. తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ చుట్టే తిరుగుతోంది. కానీ ఉప ఎన్నిక వాదాయి పడటంతో పార్టీల్లో దూకుడు సన్నగిల్లిందని తెలుస్తోంది. అందుకే పార్టీలు మెల్లగా తమ వ్యూహాలను ఖరారు చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి.

    హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు బాధ్యతను ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో ఆయన నిరంతరం అక్కడే మకాం వేసి అన్ని వర్గాలను ఏకం చేసి టీఆర్ఎస్ ను విజయతీరాలకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్నారు. బీజేపీని నిలువరించే పనిలో భాగంగా ఆయన 24 గంటలు అక్కడే ఉంటూ అందరిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో ద్విముఖ పోరు ఉండే వీలున్నందున రెండు పార్టీలు తమ శక్తియుక్తుల్ని బలోపేతం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

    హుజురాబాద్ లో రాజకీయ వేడి తగ్గిందని తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికను వాయిదా వేయడంతో పార్టీలు వ్యూహాలు మార్చుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకునే క్రమంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పలు విధాలుగా కసరత్తులు చేస్తున్నాయి. హఠాత్తుగా ఎన్నికల వేడి తగ్గిపోవడంతో పార్టీల్లో కూడా నైరాశ్యం నెలకొంది. గెలుపు కోసం అదే ఊపులో ఉన్న పార్టీలు తేదీలు వాయిదా పడటంతో ముందుకు వెళ్లలేకపోతున్నాయి.