https://oktelugu.com/

AP High Court : భార్యను హింసిస్తే ఇక అంతే.. కోర్టు సంచలన తీర్పు

అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ గానీ కోర్టు సమర్థిస్తే వారికి శిక్ష పడడం ఖాయం.

Written By:
  • NARESH
  • , Updated On : February 21, 2024 9:44 pm
    Follow us on

    AP High Court : ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. గృహహింస కేసులు సైతం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదనపు కట్నం కోసం, అనుమానం, వివాహేతర సంబంధాలు వంటి కారణాలతో మహిళలు హింసకు గురవుతున్నారు. వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. కొందరైతే హత్యలకు పాల్పడుతున్నారు.అమానుషంగా కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు. ఇటువంటి వారు భయపడేలా.. ఇటువంటి నేరాలకు చెక్ పడేలా ఓ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భార్యను చంపిన భర్తతో పాటు.. సహకరించిన తండ్రికి కూడా ఉరి శిక్షను విధించింది. కేవలం ఏడాది వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు వేసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్లో గత ఏడాది జంట హత్యలు జరిగాయి. పెళ్లి జరిగిన 14 రోజులకి నవవధువు రుక్మిణిని, ఆమె తల్లి రమాదేవి హత్యకు గురయ్యారు. అత్తింటివారే హత్య చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రుక్మిణి భర్త శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవి లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గత ఏడాది కాలంగా కర్నూలు ఫ్యామిలీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇటీవలే తుది విచారణ పూర్తయ్యింది. ఈరోజు కోర్టు తుది తీర్పును వెల్లడించింది. శ్రవణ్ తో పాటు అతడి తండ్రి వరప్రసాద్ కలిసి ఈ హత్యలు చేశారని న్యాయస్థానం నిర్ధారించింది. తల్లి రమాదేవి సహకరించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో శ్రవణ్, వరప్రసాద్ లకు ఉరిశిక్షను ఖరారు చేసింది. రమాదేవికి యావజ్జీవ శిక్షను విధించింది.

    కోర్టు తీర్పు పై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తీవ్రమైన నేరాల్లో వీలైనంత త్వరలో కేసులు పూర్తి కావాలని.. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష వేయడం సరైన చర్య అని అభిప్రాయపడుతున్నాయి. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ గానీ కోర్టు సమర్థిస్తే వారికి శిక్ష పడడం ఖాయం.