https://oktelugu.com/

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

ఇది కాలం వేసిన కాటు.. కరోనా తెచ్చిన పోటు.. మనిషి చేసుకున్న పాపం ఇప్పుడు ఎందరో అమయాకులను బలి తీసుకుంటోంది. చైనావోడి కక్కుర్తికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బలి అయిపోయితున్నారు. ఈ పాపం కరోనాదా.? మనుషులు చేసుకున్నాదా తేల్చడానికి ఇప్పుడు సమయం కాదు. ప్రాణాలు కాపాడుకోవడమే ఇప్పుడు మనముందున్న కర్తవ్యం. కరోనా.. ఇప్పుడు ఎందరి జీవితాలనో అతలాకుతలం చేస్తోంది. గొప్పగా బతికినోళ్లను రోడ్డున పడేస్తోంది. రోడ్డున ఉన్నోళ్లను కాటికి పంపుతోంది. కాదెవరు ఈ మహమ్మారికి అనర్హం అన్నట్టుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2020 11:33 am
    Follow us on


    ఇది కాలం వేసిన కాటు.. కరోనా తెచ్చిన పోటు.. మనిషి చేసుకున్న పాపం ఇప్పుడు ఎందరో అమయాకులను బలి తీసుకుంటోంది. చైనావోడి కక్కుర్తికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బలి అయిపోయితున్నారు. ఈ పాపం కరోనాదా.? మనుషులు చేసుకున్నాదా తేల్చడానికి ఇప్పుడు సమయం కాదు. ప్రాణాలు కాపాడుకోవడమే ఇప్పుడు మనముందున్న కర్తవ్యం.

    కరోనా.. ఇప్పుడు ఎందరి జీవితాలనో అతలాకుతలం చేస్తోంది. గొప్పగా బతికినోళ్లను రోడ్డున పడేస్తోంది. రోడ్డున ఉన్నోళ్లను కాటికి పంపుతోంది. కాదెవరు ఈ మహమ్మారికి అనర్హం అన్నట్టుగా ఉంది.

    విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

    జర్నలిస్ట్.. పేరు గొప్ప ఊరు దిబ్బలాంటి ఉద్యోగాలివీ.. సమాజంలో గొప్ప గౌరవం ఉంటుంది. కానీ చేతిలో రూపాయి ఉండదు. సంపాదించుకునే స్కోప్ ఉండదు. అందుకే కరోనా రాగానే మొదట ఫీల్డ్ లో ఉండే వీరికే ఎఫెక్ట్ పడింది. కంపెనీల కబంధ హస్తల్లో బోటాబోటీ జీతాలతో వెళ్లదీసే జర్నలిస్టుల బతుకులు ఘోరాతి ఘోరం.. ఏదైనా రోగమొస్తే పట్టించుకోవడానికి సంస్థ ముందుకు రాదు.. ప్రభుత్వాలు సహకరించవు. పెద్దగా సంపాదించుకోకపోవడంతో డబ్బులు చేతిలో ఉండవు. దీంతో జర్నలిస్టుల జీవితాలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతూనే ఉంటాయి. అందరికీ అన్ని స్కీంలు ఇస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టులకు మాత్రం అవేవీ వర్తింపచేయవు. అదో దురదృష్టం.

    ఇప్పుడు అలాంటి జర్నలిస్ట్ ఆవేదన కన్నీళ్లు పెట్టిస్తోంది. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ అనే జర్నలిస్ట్ కు కరోనా సోకింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఓ పత్రికలో రిపోర్టర్. కరోనా ఊపరితిత్తులకు ఎఫెక్ట్ అయ్యిందని వైద్యులు తెలిపారట. కనీసం మాట కూడా మాట్లాడడం రావడం లేదు. చేతిలో డబ్బులు లేవు.. ప్రాణం పోయేలా ఉంది. ఈ విపత్కర సమయంలో ఓ సెల్పీ వీడియో తీశాడు..

    సిద్దిపేటకే చెందిన మంత్రి హరీష్ రావును వేడుకున్నాడు. హరీషన్నా కాస్త ఆపోలో ఆస్పత్రిలో ఒక బెడ్ ఇప్పించడన్నా అని వీడియోలో బతిమిలాడుకున్నాడు. డబ్బులు ఏమీ లేవన్నా.. కుటుంబమంతా ఏడుస్తున్నారని.. ఆపోలోలో బెడ్ ఇప్పించి చికిత్స అందించి కాపాడండి అని బోరుమన్నాడు. మాట్లాడడానికి కూడా మాట వస్తలేదంటూ కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న జర్నలిస్ట్ శ్రీనివాస్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

    యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

    ఇప్పుడీ వీడియో అందరినీ కదిలిస్తోంది. కన్నీళ్లు పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ జర్నలిస్ట్ ఆవేదన మాత్రం జర్నలిస్ట్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. తాడు బొంగరం లేని జర్నలిజాన్ని నమ్ముకున్న జర్నలిస్టుల ఆవేదనను కళ్లకు కడుతోంది.

    అయితే ఈ జర్నలిస్ట్ దుస్థితి మంత్రి హరీష్ ను కూడా కదిలించింది. మంత్రి హరీష్ రాత్రి యశోద ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి బెడ్ ఇప్పించారు. ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కోలుకుంటున్నాడని టీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ తెలిపారు. రాత్రి నుండి యాంటీ వైరల్, బయటిక్ మెడిసిన్స్ ద్వారా ఊపిరితిత్తుల చికిత్స జరుగుతోందని.. రాత్రి తో పోల్చుకుంటే ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తెలిపారు. మంత్రి హరీష్ రావు చూపిన చొరవపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

    కరోనా పాజిటివ్ వచ్చిన ఓ జర్నలిస్ట్ ఆవేదన చూడండి | Breaking News | News Zone Telugu