బండి సంజయ్ పై తొడగొట్టిన హరీష్ రావు

మరికొద్ది రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికకు ఓటింగ్‌ జరుగనుంది. దీంతో పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలతో హీట్‌ పుట్టిస్తున్నారు. టీఆర్‌‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుండగా.. ఆయా పార్టీలు ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. మొత్తంగా ఈ ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. అయితే.. ఇటీవల బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌ సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అటెండ్‌ అయ్యారు. ఆయన ప్రభుత్వం […]

Written By: NARESH, Updated On : October 20, 2020 2:01 pm
Follow us on

మరికొద్ది రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికకు ఓటింగ్‌ జరుగనుంది. దీంతో పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలతో హీట్‌ పుట్టిస్తున్నారు. టీఆర్‌‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుండగా.. ఆయా పార్టీలు ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. మొత్తంగా ఈ ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. అయితే.. ఇటీవల బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌ సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అటెండ్‌ అయ్యారు. ఆయన ప్రభుత్వం పలు విమర్శలు చేశారు.

Also Read: కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టాడా?

ఇప్పుడు వాటిని సవాల్‌ చేస్తూ.. మంత్రి హరీష్‌రావు ప్రతిసవాల్‌ విసిరారు. మంత్రి హరీష్‌రావు ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికను తన భుజాలపై వేసుకున్నారు. తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. గెలుపుతోపాటు భారీ మెజార్టీ సాధించాలని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిస్తున్నారు.

తాజాగా.. మంత్రి హరీష్‌రావు సంజయ్‌పై ఫైర్‌‌ అయ్యారు. ‘తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో విషప్రచారం చేస్తూ దిగజారిపోతున్నారు. మీ కరీంనగర్‌ బీజేపీ మహిళా కార్పొరేటర్‌ వచ్చి బీడీ కార్మికుల పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌ మోడీ దయనే అన్నట్లుగా మాయమాటలు చెబుతున్నారు. టెండర్లు కూడా పూర్తికాని టౌన్‌హాల్‌, రోడ్ల డబ్బులను టీఆర్‌ఎస్‌ నేతలు జేబుల్లో వేసుకున్నారని పిచ్చిరాతలు రాస్తున్నారు. ఇదేనా బీజేపీ సిద్ధాంతం. ఓట్ల కోసం గడ్డి తింటారా. మీరు చేసే అసత్య ప్రచారాలను నిరూపించడానికి దుబ్బాక బస్టాండ్‌ సెంటర్‌కు రావడానికి సిద్ధమేనా? మీరు నిజమని నిరూపిస్తే నా మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తా. లేదా మీ అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా’ అంటూ సంజయ్‌కు హరీష్‌  సవాల్‌ విసిరారు.

Also Read: హైదరాబాద్‌లో మళ్లీ భయం.. జోరందుకున్న వర్షం!

సోమవారం ఆయన సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘బీజేపీ వాళ్లు ప్రచారం చేస్తున్నవి అబద్ధాలని.. మేం చెబుతున్న నిజాలు ఇవి’ అంటూ పలు ఆధారాలను మీడియాకు చూపారు. సోషల్‌ మీడియాలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తున్నదని, నిజాలను ప్రజలకు తెలియజేయడం తమ బాధ్యత అని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు మేనమామగా, పెద్దన్నగా సీఎం కేసీఆర్‌ కిట్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందేనన్నారు.