హైదరాబాద్‌లో మళ్లీ వర్షం జోరందుకుంది. మంగళవారం ఉదయం నుంచే చిమ్మచీకటితో భారీ వర్షం కురుస్తుండడంతో నగరవాసులు భిక్కుభిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే వరద భయాన్ని చూసిన జనం మరోసారి భయటికి రాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారుల అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల వారిని హెచ్చరించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశ ముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఉదయం నుంచే భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు.
Also Read: కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టాడా?
నగరంలో తెల్లవారుజామున నుంచే దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, చార్మినా,న చంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వర్షం పడుతోంది. అలాగే ఫిల్మ్‌నగర్, బేగంపేట, ఉప్పల్, కొత్తపేట, సంతోష్‌నగర్, సికింద్రాబాద్, మీర్‌పేట, రామంతాపూర్, హబ్సీగూడలో కుండపోత వర్షం కురుస్తోంది. అల్పపీడనం కారణంగా మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని ఇదివరకే అధికారులు ప్రకటించారు. దీంతో ఇళ్లలో నుంచి ప్రజలు ఎవరూ బయటికి రావద్దని సూచిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జలాశయాల వద్ద ఉన్న బోట్లను తెప్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ 53 బోట్లను ఏర్పాటు చేశారు. అత్యవర పరిస్థితిలో వీటిని ఉపయోగించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వరద నియోజకవర్గాల్లో ఆయ ఎమ్మెల్యే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న పది రోజుల్లో వరద సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గత మూడు రోజుల కిందట కురిసిన భారీ వర్షంతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ తరువాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.550 కోట్లు ప్రకటించింది. ప్రతి ఇంటికి రూ. 10వేలు ఇస్తానని తెలిపింది. అలాగే పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రాథమికంగా రూ. లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50 వేలు మంజూరు చేసింది. ఈ పరిహారాన్ని మంగళవారం పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఉదయం నుంచి వర్షం పడడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వరద సహాయ చర్యలు చేపడుతున్నారు.
Also Read: టీడీపీ అనుకూల బ్యాచ్ కు గట్టి షాకిచ్చిన సోము వీర్రాజు!
మరోవైపు హైదరాబాద్ పరిస్థితిని చూసి చలించిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ముందుగా తమిళనాడు రూ. 10 కోట్లు ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ సీఎం రూ. 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 5 కోట్లు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.