https://oktelugu.com/

దండకారణ్యంలో అలజడి: ఆపరేషన్ ప్రహార్ తో మావోల ఏరివేత

దండకారణ్యంలో అలజడి మొదలైంది.. ఆపరేషన్ దండకారణ్య కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. మాయిస్టులు చాప కింద నీరులా విస్తరిస్తుండడం, పెద్ద ఎత్తున మిలటరీ దాడులకు ప్లాన్ చేస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మావోయిస్టుల ఏరివేతకు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ కంచుకోట అయిన దండకారణ్యంపై కేంద్ర సాయుధ బలగాలతో దాడికి  రెడీ అయింది. ఐదు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దండకారణ్యంలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర  బలగాలు మావోల ఏరివేత […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 01:32 PM IST
    Follow us on

    దండకారణ్యంలో అలజడి మొదలైంది.. ఆపరేషన్ దండకారణ్య కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. మాయిస్టులు చాప కింద నీరులా విస్తరిస్తుండడం, పెద్ద ఎత్తున మిలటరీ దాడులకు ప్లాన్ చేస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మావోయిస్టుల ఏరివేతకు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ కంచుకోట అయిన దండకారణ్యంపై కేంద్ర సాయుధ బలగాలతో దాడికి  రెడీ అయింది. ఐదు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దండకారణ్యంలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర  బలగాలు మావోల ఏరివేత ఆపరేషన్ చేపట్టనున్నాయి.

    Also Read: టీడీపీ అనుకూల బ్యాచ్ కు గట్టి షాకిచ్చిన సోము వీర్రాజు!

    * ఐదు రాష్ట్రాలు.. పది వ్యూహాలు
    నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో పది రకాల వ్యూహాలను కేంద్ర ప్రభుత్వం రచిస్తోంది. నవంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తిస్థాయిలో నక్సల్స్ లేకుండా చేయాలన్న ఎజెండాతో ఆపరేషన్ ప్రహార్ మొదలుపెట్టనుంది కేంద్రం. దండకారణ్యం విస్తరించి ఉన్న చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై దృష్టి సారించి మావోయిస్టుల కంచుకోటను బద్దలు కొట్టేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.

    * కొత్త రాష్ట్రాల్లో పాగా కోసం మావోలు..
    మరో వైపు కొత్త రాష్ట్రాల్లో  తమ కార్యకలాపాలను విస్తరించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఆపరేషన్ ప్రహార్ మొదలుపెడితే కొత్తగా ఇంకో రెండు కొత్త రాష్ట్రాలకు విస్తరించేందుకు మావోలు సిద్ధమవుతున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    * మావోలకు జనాలతో సంబంధాలు కట్ చేసి..
    మావోయిస్టుల అణచివేతకు ఈనెల 15న ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో కీలకమైన  వీడియో కాన్ఫరెన్స్ ను కేంద్రం నిర్వహించింది.  ఈ సమావేశంలో దండకారణ్యంలో ఏ విధంగా మావోల స్థావరాలపై అటాక్ చేయాలి అన్న ప్లాన్స్ పై చర్చ జరిగినట్టు ప్రచారమవుతోంది. మావోయిస్టులకు బయట గ్రామాలలో ఉండి సహకరిస్తున్న సానుభూతిపరులను టార్గెట్  చేయడంతో పాటు,  మావోయిస్టు స్థావరాలకు నిత్యావసరాలు అందకుండా చేయడం, ఏకకాలం మావోల ఏరివేత, మావోయిస్టు సానుభూతిపరుల భావ జాల ప్రచారాన్ని ఎదుర్కొవడం లాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలని  నిర్ణయించినట్టు తెలుస్తోంది.

    Also Read: హైదరాబాద్‌లో మళ్లీ భయం.. జోరందుకున్న వర్షం!

    * వీరప్పన్ మట్టుబెట్టిన విజయ్ కుమార్ కు బాధ్యతలు
    ఆపరేషన్ ప్రహార్ బాధ్యతలను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టిన తమిళనాడు పోలీస్ ఆఫీసర్ విజయ్ కుమార్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు, కేంద్ర, రాష్ట్ర బలగాలకు జరుగుతున్న వార్లో  మావోయిస్టులు ఉనికి కోల్పోతారా.?, పోలీసులు పట్టు సాధిస్తారా.?  అన్నది మున్ముందు తెలుస్తుంది.  ఏది ఏమైనా ఇప్పటికే దండకారణ్యంలో నివసించే ఏజెన్సీ ప్రజలు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కు మంటున్నారు.