Homeఆంధ్రప్రదేశ్‌Half Day Schools: ఏపీలో ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు

Half Day Schools: ఏపీలో ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు

Half Day Schools: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు వస్తున్నాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ సోకే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఒంటిపూట బడులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు కొనసాగించాలని చూస్తున్నారు.

Half Day Schools
Half Day Schools

వేసవి తాపం ఉండటంతో ఏవైనా అత్యవసర పనులు ఉంటే ఉదయం పూట మాత్రమే చూసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వస్తే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకే పనులు చూసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 27 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Also Read: Snake Viral Photo: ఈ ఫొటోలో పాము కనిపెడితే మీరే తోపు.. ఇలా కనిపెట్టొచ్చు

కరోనా ప్రభావంతో రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం ఈ సారి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. దీంతో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సమర్థంగా నిర్వహించాలని భావిస్తోంది. అందుకే విద్యార్థులకు కూడా ఎండ దెబ్బ తగలకుండా ఉదయం పూటే పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.

చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ ధాటికి వేగలేకపోతున్నారు. అందుకే ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Half Day Schools
Half Day Schools

విజయవాడ, విశాఖ పట్నం జిల్లాల్లో కూడా ఎండ తీవ్ర పెరుగుతోంది. సముద్రం నుంచి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎండల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఎండల సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. ద్రవపదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐస్ క్రీములు, కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Also Read: Janasena Party Protest : ‘పవర్ స్టార్’.. ‘పవర్’ చూపిస్తున్నాడుగా!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version