శ్రీవారి భక్తుల తలనీలాల స్మగ్లింగ్.. దీని వెనుక ఎవరి హస్తం..?

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ప్రతీ భక్తుడు తలనీలాలు సమర్పిస్తుంటారు. మొక్కులు మొక్కుకొని కొందరు.. మొక్కులు తీరాయని మరికొందరు.. భక్తితో ఇంకొందరు తలనీలాల్ని ఇస్తుంటారు. అయితే.. ఈ తలనీలాలు అనూహ్యంగా మిజోరం సరిహద్దుల్లో పట్టుబడ్డాయి. ఓ ట్రక్కు నిండా మయన్మార్ బోర్డర్ నుంచి చైనాకు స్మగ్లింగ్ చేస్తుండగా.. సరిహద్దులో కాపలా కాసే అస్సాం రైఫిల్స్ సిబ్బంది వీటిని పట్టుకున్నారు. అసలు ఆ జుట్టేంటి..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఎక్కడ్నుంచి సమీకరించారు..? ఈ వివరాలన్నీ బయటకు లాగారు. పది రోజుల […]

Written By: Srinivas, Updated On : March 30, 2021 2:11 pm
Follow us on


తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ప్రతీ భక్తుడు తలనీలాలు సమర్పిస్తుంటారు. మొక్కులు మొక్కుకొని కొందరు.. మొక్కులు తీరాయని మరికొందరు.. భక్తితో ఇంకొందరు తలనీలాల్ని ఇస్తుంటారు. అయితే.. ఈ తలనీలాలు అనూహ్యంగా మిజోరం సరిహద్దుల్లో పట్టుబడ్డాయి. ఓ ట్రక్కు నిండా మయన్మార్ బోర్డర్ నుంచి చైనాకు స్మగ్లింగ్ చేస్తుండగా.. సరిహద్దులో కాపలా కాసే అస్సాం రైఫిల్స్ సిబ్బంది వీటిని పట్టుకున్నారు. అసలు ఆ జుట్టేంటి..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఎక్కడ్నుంచి సమీకరించారు..? ఈ వివరాలన్నీ బయటకు లాగారు.

పది రోజుల కిందట పట్టుబడితే ఇప్పటికే సమాచారం మొత్తం బయటకు వచ్చింది. ఆ జుట్టు అంతా.. శ్రీవారి భక్తులు సమర్పించిన తలనీలాలని తేలింది. శ్రీవారి తలనీలాలను ఈ–వేలం వేస్తారు. ప్రతీ ఏడాది దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల వరకూ ఆదాయం సమకూరుతుంది. డబ్బులు కట్టి కాంట్రాక్టర్ తీసుకుపోతారు. ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రాసెస్. ఎక్కువగా విదేశీ సంస్థలే వీటిని కొంటుంటాయి. అధికారికంగా కొంటారు కాబట్టి వారికి స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాజమార్గంలోనే విదేశాలకు తరలిస్తారు.

మరి స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది..? ఎవరికి అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన వారిని అస్సాం రైఫిల్స్ బృందం పట్టుకుంది. బోర్డర్‌లో వారి విధి వారు నిర్వహించారు. కానీ.. అసలు ఆ తలనీలాలు వారికెలా వచ్చాయి. ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారు అన్నది తేల్చుకోవాల్సింది టీటీడీనే కదా.

శ్రీవారి తలనీలాలు అక్రమంగా స్మగ్లింగ్ అవుతున్నాయంటే.. అవి టీటీడీ నుంచే ఎవరో సహకరిస్తున్నారని అనుమానించాల్సి వస్తోంది. బయట వ్యక్తులు తరలించే అవకాశం లేదు. ఒకవేళ బయట వ్యక్తులు తరలిస్తే.. దాన్ని టీటీడీలోని వ్యక్తులే ఇచ్చి ఉంటారు. అంత పెద్ద మొత్తంలో వెంట్రుకలు ఎలా ఇస్తార్ననది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. మరోవైపు అస్సాం రైఫిల్స్ వద్ద నుంచి పూర్తి సమాచారం తీసుకుని విచారణ చేయాల్సిన టీటీడీ సైలెంట్‌గా ఉండిపోతోంది. భక్తులు ఇస్తున్న తలనీలాలు ఎలా బయటకు వెళ్లాయో తేల్చుకోవాల్సింది పోయి మౌనం పాటిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. భక్తుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.