Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇంకా ఎన్నికలు రాకముందే వేడి మాత్రం వ్యాపిస్తోంది. సమీకరణలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల దాడిలో గాయపడిన సుబ్బారావు గుప్తా దానిపై కోపంతో తన రాజకీయ బలాన్ని చూపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో ఆర్యవైశ్య ఐక్యతాసభ నిర్వహించి తానేమిటో నిరూపించుకున్నారు. అన్ని పార్టీల్లో ఉన్న ఆర్యవైశ్య నేతలను పిలిపించి సభను విజయవంతంగా నిర్వహించారు.

దీంతో సుబ్బారావు గుప్తా వెనుక వంగవీటి రాధాకృష్ణ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆర్యవైశ్య ఐక్యతా సభ కంటే ముందు ఆయన వంగవీటితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇచ్చిన ప్రోద్బలంతోనే గుప్తా ఈ మేరకు ముందుకు కదులుతున్నట్లు అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆర్యవైశ్య ఐక్యతా సభలో గుప్తా ఘాటైన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
Also Read: జగన్ మోడీకి సమర్పించిన వినతిపత్రం ఎలా ఉంది?
అయితే ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. జగన్ గుప్తాకు అపాయింట్ మెంట్ ఇచ్చినా తను మాత్రం కలవడం లేదని తేల్చారు. ఐక్యతా సభలో వైశ్యులపై జరుగుతున్న దాడులపై నేతలంతా స్పందించి వాటిని ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందని హెచ్చరించారు.
సుబ్బారావు గుప్తాకు మనోధైర్యం కలిగించే నేత ఎవరో వెనకుండా నడిపిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో గుప్తా వెనకుండి ప్రోత్సహిస్తుంది వంగవీటి అనే సంశయాలు అందరిలో వస్తున్నాయి. అందుకే గుప్తా తన ప్రభావం చూపించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. దీనికి రాజకీయ నాయకులను సైతం తన వెంట ఉంచుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదిఏమైనా రాష్ర్టంలో రాజకీయాలు కీలక మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: వంగవీటి… వైసీపీకి దూరంగా.. టీడీపీకి దగ్గరగా.. ఏం జరిగింది?