Guntur: అక్రమ సంబంధాలతో అనర్థాలు జరుగుతున్నాయి. పెళ్లయి భార్యాపిల్లలున్నా పరాయి మహిళ మోజులో పడి వారితో సహజీవనం చేస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. నాగరికత ముసుగులో మగువలను మైమరిపిస్తూ తమ అవసరాలు తీర్చుకుని తీరా వారిని కడతేర్చుతున్నారు. అనుమానమనే పెనుభూతంతో సాటి వారిని సైతం తిరిగి రాని లోకాలకు పంపిస్తున్నారు. కాలమేదైనా కనికరం లేకుండా ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మహిళ అదే గ్రామానికి చెందిన చేకూరి సురేష్ తో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు కూడా 13 ఏళ్ల కూతురు ఉంది. ఇన్నాళ్లు హాయిగానే సాగిన వారి జీవితంలో అనుమానమనే పెనుభూతం ఆవహించింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో పలుమార్లు వివాదాలు సైతం జరిగాయి.
దీంతో అతడి కర్కశత్వం పెరిగిపోయింది. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం పన్నాడు అనుకున్నదే తడవుగా ప్రణాళిక అమలు చేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఈనెల 19న తెల్లవారుజామున తల్లీకూతుర్లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బయట గడియపెట్టి నిప్పంటించాడు. దీంతో ఇద్దరు నిద్ర నుంచి లేచి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని రక్షించారు.
Also Read: Sentiment politics: రాజకీయాల్లో ‘సానుభూతి’కి కాలం చెల్లిందా?
బాధితురాలు ఫిర్యాదు మేరకు సురేష్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పెళ్లయి పిల్లలున్నా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు వారినే హతమార్చాలని చూసిన సురేష్ ను అందరు అసహ్యించుకున్నారు. ఎట్టకేలకు జైలు పాలు కావడంతో కథ సుఖాంతమైంది.
Also Read: Nara Bhuvaneswari: టీడీపీని గాడిలో పెట్టే పనిలో భువనేశ్వరి.. పార్టీ ఆలోచన ఇదేనా?