America Gun Fire: అమెరికాలో తుపాకీ సంస్కృతి పెరిగిపోతోంది. ఫలితంగా రక్తపాతమే కనిపిస్తోంది. కొన్నాళ్లుగా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. హాయిగా జీవించాల్సిన వారి ఆయుష్షును మధ్యలోనే తీస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే దారుణం జరిగిపోతోంది. దీంతో ప్రాణభయంతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఎందుకీ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎందుకు కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అభివృద్ధి దేశమైన అమెరికాలో కాల్పులు జరుపుతూ జంతువుల మాదిరి వేటాడినట్లు వ్యవహరిస్తున్నారు. స్థలమేదైనా మనుషుల ప్రాణాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. షాపింగ్ మాల్స్, పాఠశాలలు, పార్కులు స్థలాలేవైనా దుండగులు కాల్పులు జరుపుతూ మనుషులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

తాజాగా టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు చనిపోయారు. మొత్తం 22 మంది మరణించడం సంచలనం సృష్టించింది. విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్యలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. దేశంలో నానాటికి తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద దేశంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులు సైకోలుగా మారి తోటి వారిని సైతం లెక్కచేయకుండా కాల్పులు జరుపుతూ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు.
Also Read: Iron- Deficiency: ఐరన్ లోపం ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయా?
అభివృద్ధి చెందిన దేశం కావడంతో చాలా దేశాల నుంచి ఎక్కువ మంది అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కానీ తుపాకీ సంస్కృతి కి భయపడి ఇక్కడకు రావడానికి కూడా వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉన్న దేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విడ్డూరమే. రాక్షసంగా మనుషుల ప్రాణాలు తోడేసే చర్యలకు చాలా మంది జంకుతున్నారు. బయటకు వచ్చేందుకు కూడా సాహసం చేయడం లేదు. ఎక్కడ కాల్పుల కలకలం చోటుచేసుకుంటుందో అనే భయమే వారిని నిత్యం వెంటాడుతోది. ఈ క్రమంలో అమెరికా కాల్పుల వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్నా అవి మాత్రం ఆగడం లేదు. పర్యవసానంగా ప్రజలే సమిధలు కావడం గమనార్హం.

పది రోజుల క్రితం ఓ కిరాణా దుకాణంలో జరిపిన జాత్యహంకార దాడిలో 10 మంది మృతి చెందిన విషయం మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తానికి అమెరికా దేశంలో కాల్పుల సంప్రదాయం మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రజల్లో నిత్యం భయమే వెంటాడుతోంది. సురక్షితంగా ఉద్యోగాలు చేసుకోవాల్సిన జనం కాల్పుల తతంగంపై హైరానా పడుతున్నారు. కాల్పుల ఘటనలు తరచుగా జరుగుతుంటే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నానాటికి పెరుగుతున్న దాడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎటు నుంచి వస్తారో తెలియదు. ఎలా కాల్పులు జరుపుతారో కూడా అర్థం కావడం లేదు. తుపాకీ సంస్కృతితో దేశం యావత్తు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందనేది నిర్వివాదాంశమే.
Also Read:Sheep In Jail: ఆ గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు.. ఇంతకీ ఏం చేసింది?
Recommended videos



[…] Also Read: America Gun Fire: అమెరికా లో తుపాకీ విలయం.. 22 మంది … […]
[…] Also Read: America Gun Fire: అమెరికా లో తుపాకీ విలయం.. 22 మంది … […]
[…] Read: America Gun Fire: అమెరికా లో తుపాకీ విలయం.. 22 మంది … Recommended […]
[…] Read:America Gun Fire: అమెరికా లో తుపాకీ విలయం.. 22 మంది … Recommended […]