Bindu Madhavi Prize Money: బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందుమాధవి నిలిచింది. బిగ్ బాస్ షో హిస్టరీలోనే మొదటి సారి మహిళా విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. సిని జీవితంలో సక్సెస్ కాకపోయిన బిందు మాధవి బిగ్ బాస్ ఓటీటీలో విజేతగా నిలవడం విశేషం. తెలుగులో పలు సినిమాల్లో నటించినా బిందుమాధవికి సరైన గుర్తింపు రాలేదు. అయితే తమిళంలో మాత్రం అవకాశాలు చేజిక్కించుకుంటూ మంచి గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు టీవీలో ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మొదటిసారిగా ఓటీటీ వేదికగా వచ్చింది. ఈ షో 12 వారాల పాటు నిర్విరామంగా కొనసాగింది. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు మొదటి విజేతగా నిలిచి తొలి మహిళగా బిందు మాధవి టైటిల్ గెలవడం విశేషం. బిగ్ బాస్ విజేతగా నిలిచిన బిందుమాధవికి ఈ షో మొత్తంలో ఎంత ప్రైజ్ మనీ దక్కిందన్న విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

తెలుగులో ‘అవకాయ బిర్యానీ’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి ఆ తరువాత ‘బంఫర్ ఆఫర్’, ‘రామరామ కృష్ణ’ అనే సినిమాల్లో నటించింది. ఆమె చివరి సారిగా ‘పిల్ల జమిందార్’ సినిమాలో కనిపించింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లింది. కానీ అమెకు అక్కడా అవకాశాల దారులు పడ్డాయి. దీంతో బిందుమాధవి కోలీవుడ్ మంచి హీరోయిన్ గా గుర్తింపు సాధించింది. అవకాశాల కోసం ఏ విధంగానైనా నటిస్తానని బిందుమాధవి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
Also Read: America Gun Fire: అమెరికా లో తుపాకీ విలయం.. 22 మంది విద్యార్థుల దుర్మరణం.. ఎందుకీ ఉన్మాదం?
ఈ తరుణంలోనే తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి అవకాశం రావడంతో బిందుమాధవి పాల్గొని తన ఫర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. టాస్క్స్, గేమ్స్ తో ముందుకు వెళుతూ మిగతా కంటెస్టెంట్లను దాటుకుంటూ నంబర్ వన్ స్టానంలో నిలిచింది. ఆమెకు అఖిల్ సార్థక్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ బిందుమాధవి అన్నీ దాటుకొని విజేతగా ఆవిర్భవించింది. మొత్తం 18 మంది కంటెస్టెంట్లుు పాల్గొన్న ఈ షోలో బిందుమాధవి మొదటిస్థానంలో, అఖిల్ సార్థక్ రెండో స్థానంలో, యాంకర్ శివ మూడో స్థానంలో నిలిచారు. అయితే బిందుమాధవి హోస్ లో ఉన్నందుకు రెమ్యూనరేషన్ తోపాటు.. విజేతగా నిలిచినందుకు 40 లక్షల మొత్తాన్ని పొందింది. అన్ని కలుపుకొని రూ. 90 లక్షల వరకు బిందుకు ప్రైజ్ మనీ దక్కినట్లు సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ ఈవెంట్ లో సూట్ కేస్ ఎవరు తీసుకుంటారని దర్శకుడు అనిల్ రావిపూడి అడిగినప్పుడు అరియానా గ్లోరీ ముందుకు వచ్చారు. తనకు ఇల్లు కట్టుకునేందుకు డబ్బు అవసరం ఉందని చెప్పారు. దీంతో ముందుగా విన్నర్ కు కేటాయించిన రూ.50 లక్షల్లో రూ.10 లక్షలను మినహాయించారు. దీంతో మిగతా రూ.40 లక్షలను బిందుమాధవి సొంతం చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదటి నుంచి ఆమె ఆడిన టాస్క్స్, ఇతర గేమ్స్ లన్నీ మొత్తం కలుపుకొని కోటి వరకు సంపాదించారని సమాచారం. అయితే ట్యాక్స్, ఇతర కొన్నింటిని మినహాయించి రూ.90 లక్షల వరకు బిందుమాధవికి దక్కినట్లు ప్రచారం సాగుతోంది.
సినిమాల్లో రాని రెమ్యూనరేషన్ బిగ్ బాస్ షో ద్వారా రావడంతో బిందు మాధవి ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకొని త్వరలో 6వ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేయనున్నారు. కాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో పార్ట్సిపేట్ చేసి మూడో స్థానంలో నిలిచిన యాంకర్ శివకు టీవీ షోలో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అఫీషియల్ గా ప్రకటించేవరకు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:Janhvi Kapoor: ‘జాన్వీ కపూర్’ కిల్లింగ్ లుక్.. అలా చేతులు వెనక్కి పెట్టి.. ఒళ్ళు విరవడం.. !
Recommended Videos:




[…] Also Read: Bindu Madhavi Prize Money: బిగ్ బాస్ లో పాల్గొని బిందు… […]
[…] Read:Bindu Madhavi Prize Money: బిగ్ బాస్ లో పాల్గొని బిందు… Recommended […]