Gujarati Film Chhello Show: తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు.. హైదరాబాద్ మంజూరైన కార్యాలయాలు గుజరాత్‌కు తరలిపోతున్నాయని తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్రం వివక్షతో తెలంగాణ ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలిపోతున్నాయని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తరచూ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా సినిమా అవార్డు వివాదం తెరపైకి వచ్చింది. ఆస్కార్ నామినేషన్ విషయంలోనూ వివక్ష చూపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం.. పాన్ ఇండియా మూవీగా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ఆర్ ఆస్కార్‌కు నామినేషన్ అవుతుందని అంతా భావించారు. కానీ ఇటీవల ప్రకటించిన నామినేషన్‌లో గుజరాతీ సినిమా ఛెల్లో షోకు ఆ అవకాశం దక్కింది. ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది.

గత అనుభవాలతోనే ఈ ప్రశ్నలు..
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పేర్కొన్న ప్రాజెక్టులు మంజూరు చేయడంలో, గతంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించడం, తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టులకు పోటీగా గుజరాతలో ఏర్పాటు చేయడం లాంటి ఘటనల నేపథ్యంలో ట్రిపుల్‌ఆర్ ఆస్కార్‌కు ఇండియా నుంచి నామినేషన్ కాకుండా, గుజరాత్ సినిమా కావడంపై ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యాదృచ్ఛికంగా జరిగినా ట్రిపుల్‌ఆర్‌కు గుజరాతీ సినిమా పోటీ ఇవ్వడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్‌కు వస్తుందనుకున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంప్రదాయ వైద్య కేంద్రం గుజరాత్‌కు తరలిపోయింది. ఈ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు మొదట కేంద్రం ప్రకటించింది. కానీ తర్వాత దానిని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లిపోయింది. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే ఉంది. కానీ కేంద్రం కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదని ప్రకటించింది. తాజాగా కోచ్‌ఫ్యాక్టరీ స్థానంలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీని గుజరాత్‌లో పెట్టారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ.రమణ చొరవతో హైదరాబాద్‌లో అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టును సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. దీనికి పోటీగా గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మరో కేంద్రం ఏర్పడింది. ఇలా ఒక్కొక్కడిగా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు గుజరాతీ సినిమా ఛెల్లో షో ఆస్కార్‌కు నామినేషన్‌పై తెలుగు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ను జయించినా..
తెలుగు సినిమా బాలీవుడ్‌ను జయించింది. తెలుగు దర్శకులు తీస్తున్న సినిమాలు దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదరణ పొందుతున్నాయి ఇందుకు పుష్స, ట్రిపుల్‌ఆర్, ఇటీవలి కార్తికేయ–2 సినిమాలు దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్ సినిమాలు కూడా అట్టర్‌ప్లాప్ అవుతున్న రోజుల్లో తెలుగు సినిమాలు సంచలనంగా మారాయి. రికార్డులు సృష్టించాయి. కోట్లు కొల్లగొట్టాయి. ఈక్రమంలో ట్రిపుల్‌ఆర్ ఈసారి ఆస్కార్‌కు తప్పకుండా నామినేషన్ అవుతుందని అందరూ ఆశించారు. కేంద్రమంత్రి అమిత్‌షా కూడా ట్రిపుల్‌ఆర్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటనను మెచ్చుకున్నారు. స్వయంగా కలిసి అభినందించారు. కానీ గుజరాతీ సినిమా ఛెల్లో షో ఆస్కార్‌కు నామినేషన్ అయింది. ట్రిపుల్‌ఆర్‌కు ఆ అవకాశం లేకుండాపోయింది. దీంతో తెలుగు అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి.