Isudan Gadhvi: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ప్రధాని మోడీ చరిష్మా తగ్గలేదని నిరూపించింది. ఓటింగ్ ఏకపక్షంగా సాగింది. ముక్కోణపు పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ విజయదుందుభి మోగించింది. తనకు ఎదురు లేదని చాటింది. తమలో ఇంకా సత్తా తగ్గలేదని కమలనాథులు మరోసారి చాటుకున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో సవాలుగా తీసుకుంది. నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం సాగినా కాంగ్రెస్, ఆప్ ఎక్కడో కొట్టుకుపోయాయి. బీజేపీ జడివానలో కనీసం నిలువలేకపోయాయి. అంతా అయిపోయిందనుకున్న వారి అంచనాలు తలకిందులు చేసింది.

ఇక ఢిల్లీ, పంజాబ్ లో అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇక్కడ తన ప్రభావం చూపాలని నిర్ణయించుకుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసింది. తమ సీఎం అభ్యర్థిగా ఇనుదాస్ గడ్వీని పోటీలో దింపింది. కానీ ఆయనే ఓటమి పాలవడం ఆ పార్టీని బాధించింది. ఎంతో ఆశతో బరిలో నిలిచినా కనీసం ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ వేగంలో కాంగ్రెస్, ఆప్ తట్టుకోలేకపోయాయి. బీజేపీ అనూహ్య విజయంతో రెండుపార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తమ ఓటమికి కారణాలంటనే అన్వేషణలో పడ్డాయి.
ఆప్ కు కలిసొచ్చే అంశం ఏంటంటే 13 శాతం ఓట్లు సాధించామనే ధీమా ఒక్కటే వారికి ప్లస్ అయ్యేది. ఆప్ కు గుజరాత్ ఓటర్లు షాకిచ్చారు.
మిగతావన్ని ప్రతికూలాంశాలే. బీజేపీ కురిపించిన వర్షంలో రెండు పార్టీలు కొట్టుకుపోయాయి. బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా ఏడుసార్లు అధికారం చేపట్టి గతంలో సీపీఎం పశ్చిమ బెంగాల్ లో సృష్టించిన రికార్డును బ్రేక్ చేసింది. బీజేపీ వేగానికి బ్రేకులే లేకుండా పోయాయి. 156 సీట్లు గెలుచుకుని కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తమకు ఎదురే లేదని మరోమారు నిరూపించుకుంది. బీజేపీ సృష్టించిన జడివానలో కాంగ్రెస్, ఆప్ లకు స్థానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో బీజేపీ ఫలితం సాధించింది.

పంజాబ్ మాదిరి ఫలితాలు వస్తాయని ఆశించిన ఆప్ కు నిరాశే ఎదురైంది. అరవింద్ కేజ్రీవాల్ అంచనాలు తలకిందులయ్యాయి. సింగిల్ డిజిట్ కే పరిమితం కావాల్సి వచ్చింది. కేవలం ఐదు సీట్లు గెలుచుకుని పరువు తీసుకుంది. కాంగ్రెస్ సైతం కేవలం 17 స్థానాల్లోనే జయకేతనం ఎగురవేయడం గమనార్హం. ఈ క్రమంలో గుజరాత్ ఎన్నికలు బీజేపీలో నూతనోత్తేజం నింపాయి. వచ్చే ఎన్నికలకు టానిక్ గా మారడంతో బీజేపీ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. సంబరాల్లో మునిగిపోతున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం వేసిన ప్రణాళికలతోనే బీజేపీ విజయఢంకా మోగించిందని విశ్వసిస్తున్నారు.