
కరోనా సంక్షోభం నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆదాయన్ని పెంచడమే లక్ష్యంగా జీఎస్టీ మండలి సమావేశమైంది. తాజాగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కోవిడ్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా చికిత్సకు ఉపయోగించే మందులపై పన్ను మినహాయింపునిస్తూ ఊరటకల్పించారు. అయితే వ్యాక్సిన్లపై మాత్రం జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పులు ఉండవని ట్విస్ట్ ఇచ్చారు. 5శాతం దానిపై జీఎస్టీ ఉంటుందన్నారు. ఈ మినహాయింపులు సెప్టెంబర్ 30వరకు చెల్లుబాటులో ఉంటాయని నిర్మలా తెలిపారు. దీంతో వ్యాక్సిన్లపై జీఎస్టీ వడ్డింపు నుంచి ఊరట లభిస్తుందని ఎదురుచూసిన వారికి నిరాశ మిగిలింది.
-జీఎస్టీ మండలి తీసుకున్న కీలక నిర్ణయాలివీ..
-రెమిడెసివిర్‌పై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు .
-బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బిపై జీఎస్టీ మినహాయింపు
– వ్యాక్సిన్, టెంపరేచర్ చూపే పరికరాలపై 5 శాతం జీఎస్టీ .
-అంబులెన్సులపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించిన కేంద్రం .
– కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గింపు .
-కరోనా చికిత్సకు ఉపయోగించే 3 మందులకు పన్ను మినహాయింపు .
-టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లపై జీఎస్టీ తగ్గింపు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్