https://oktelugu.com/

Minister RK Roja: బాల‌య్య‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రోజా.. ఇన్నాళ్ల‌కు గుర్తొచ్చాడా..!

Minister RK Roja: రాజ‌కీయంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు విభేదాలు ఉన్నాయి. ఇది కాద‌న‌లేని స‌త్యం. కానీ వాస్తవంగా వీరిద్ద‌రూ హీరో, హీరోయిన్లు. ఇప్పుడు కాదండోయ్‌. కెరీర్ తొలినాళ్ల‌లో వీరిద్ద‌రూ క‌లిసి చాలా సినిమాల్లో న‌టించి మెప్పించారు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. అయితే రాజకీయంగా గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు రోజా వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యారు. కాగా ఆమె తొలిసారి బాల‌కృష్ణ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 20, 2022 / 08:44 AM IST
    Follow us on

    Minister RK Roja: రాజ‌కీయంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు విభేదాలు ఉన్నాయి. ఇది కాద‌న‌లేని స‌త్యం. కానీ వాస్తవంగా వీరిద్ద‌రూ హీరో, హీరోయిన్లు. ఇప్పుడు కాదండోయ్‌. కెరీర్ తొలినాళ్ల‌లో వీరిద్ద‌రూ క‌లిసి చాలా సినిమాల్లో న‌టించి మెప్పించారు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. అయితే రాజకీయంగా గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు రోజా వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యారు.

    Minister RK Roja, balakrishna

    కాగా ఆమె తొలిసారి బాల‌కృష్ణ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న సంద‌ర్భంగా.. 1994లో బాలయ్యతో చేసిన భైరవ ద్వీపం మూవీ త‌న‌కు ఎప్పుడూ స్పెష‌లే అని చెప్పారు. ఆ మూవీ వ‌చ్చి 28 యేళ్లు కంప్లీట్ అయ్యాయ‌ని చెప్పుకొచ్చారు. అలాగే తాను హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు పూర్తయిన‌ట్టు వివ‌రించారు.

    Also Read: Sajjala Ramakrishna- Vijayasai Reddy: వైసీపీలో పెరుగుతున్న సజ్జల గ్రాఫ్.. అట్టడుగున విజయసాయిరెడ్డి

    బైర‌వ ద్వీపం మూవీ త‌న‌కు ఎంతో పేరు తెచ్చింద‌ని, అప్ప‌ట్లో అదో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన‌ట్టు వ్యాఖ్యానించారు. ఆ మూవీకి సీనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చి క్లాప్ కొట్టార‌ని, ఎలా న‌టించాలో చేసి చూపించారంటూ ఆనందంగా మాట్లాడింది. ఆ మూవీ ఓపెనింగ్‌కు చిరంజీవి లాంటి హీరోలు వ‌చ్చార‌ని గుర్తు చేసుకుంది.

    బైర‌వ‌ ద్వీపం మూవీతో తొలిసారి బాల‌కృష్ణ‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని, ఆ త‌ర్వాత తామిద్దరం క‌లిసి న‌టించిన అనేక సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ అల‌రించాయ‌ని వెల్ల‌డించింది. అయితే మంత్రి అయిన త‌ర్వాత ఆమె మాట‌ల్లో కాస్త హుందాత‌నం అనేది క‌నిపిస్తోంద‌నే చెప్పుకోవాలి. ఇంత‌కు ముందులాగా ఫైర్ మీద మాట్లాడ‌కుండా.. కాస్త క‌లుపుకునిపోయే విధంగానే ఆమె ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని దీన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

    Minister RK Roja, balakrishna

    లేక‌పోతే ఇన్ని రోజులు మాట్లాడ‌ని రోజా.. ఇప్పుడే స‌డెన్‌గా బాల‌య్య‌తో న‌టించిన మూవీల గురించి ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఏముంది. ఎమ్మెల్యేగా ఉన్న‌న్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు. అంటే తాను అనుకున్న క‌ల నెర‌వేరింది కాబ‌ట్టి ఇప్పుడు మ‌నుషుల‌ను ద‌గ్గ‌ర చేసుకోవాల‌ని భావిస్తున్నార‌న్న‌మాట‌.

    Also Read:IPL 2022: సీఎస్ కే ప్లే ఆఫ్స్ పై ఆశ‌లు పెట్టుకోవ‌చ్చా..? అన్ని మ్యాచ్ లు గెలిస్తెనే ఛాన్స్..
    Recommended Videos

    Tags