Treatment: వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి.. ఈసారి ట్రీట్మెంట్ ఎవరికో?

Treatment: అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తేనే తట్టుకోవడం లేదు. అలాంటిది సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తే ఊరుకుంటుందా? అంటే అదేమీ లేదనే సమాధానమే విన్పిస్తోంది. తామే ఎప్పుడు అధికారంలో ఉంటామనే ధీమానే ఏమో తెలియదుగానీ వైసీపీ దూకుడు రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. ఇటీవల కాలంలో వ్యక్తుల దాడుల మొదలుకొని పార్టీల కార్యాయాలపై దాడులు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రతిపక్షాలపై దాడిని వైసీపీ నేతలు సమర్ధించుకున్నప్పటికీ సొంత పార్టీ నేతలపై దాడులే కలవరానికి గురిచేస్తున్నాయి. […]

Written By: NARESH, Updated On : January 3, 2022 9:42 am
Follow us on

Treatment: అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తేనే తట్టుకోవడం లేదు. అలాంటిది సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తే ఊరుకుంటుందా? అంటే అదేమీ లేదనే సమాధానమే విన్పిస్తోంది. తామే ఎప్పుడు అధికారంలో ఉంటామనే ధీమానే ఏమో తెలియదుగానీ వైసీపీ దూకుడు రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. ఇటీవల కాలంలో వ్యక్తుల దాడుల మొదలుకొని పార్టీల కార్యాయాలపై దాడులు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ప్రతిపక్షాలపై దాడిని వైసీపీ నేతలు సమర్ధించుకున్నప్పటికీ సొంత పార్టీ నేతలపై దాడులే కలవరానికి గురిచేస్తున్నాయి. అధిష్టానం వద్ద పలుకుబడిన ఉన్న నేతలు ఇటీవల కాలంలో తమ, పరాయి అనే తేడా లేకుండా భౌతిక దాడులకు పాల్పడులకు పాల్పడుతుండటం ఏపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. వైసీపీకి చెందిన సుబ్బారావు గుప్తా, కొండ్రెడ్డిల జరిగిన దాడులే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు కొద్దిరోజులుగా తరుచూ వైసీపీలో వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.

వైసీపీ నేతలు ప్రతిపక్ష, సొంత పార్టీల నేతలపై దూకుడును ప్రదర్శిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట ఆపార్టీలో అసంతృప్తి జ్వాలలు మండుతూనే ఉన్నాయి. తాజాగా పాయకరావుపేటలోని వైసీపీ కిందిస్థాయిలో క్యాడర్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబురావు గెలుపు కోసం తాము కష్టపడి చేశామని చెబుతున్నారు. తీరా ఆయన గెలిచాక తమను పట్టించుకోవడం లేదని.. చేయితడిపితేగానీ పనులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

పాయకరావుపేటలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎమ్మెల్యే తీరుపై నిరసనలకు దిగుతోంది. బాబు రావు వద్దు.. జగన్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కార్యకర్తలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో బొలిశెట్టి గోవింద్ అనే ఎంపీటీసీ దూకుడుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఆయన భారీగా కార్యకర్తలను సమీకరించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా  నిరసనలు చేస్తున్నారు. దీంతో కొండ్రెడ్డి, సుబ్బారావు గుప్తా మాదిరిగానే గోవింద్ కు ట్రీట్మెంట్ తప్పదా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది.

అయితే కొండ్రెడ్డి, సుబ్బారావులపై జరిగిన దాడుల్లో అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు ఉన్నారని.. కానీ పాయకరావుపేట ఎమ్మెల్యేకు అధిష్టానం వద్ద అంత సీన్ లేదనే టాక్ విన్పిస్తోంది. దీంతో గోవింద్ విషయంలో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం లేదని మరోవర్గం వాదిస్తోంది. ఏదిఏమైనా కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతుండటంతో వీటికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందనేది ఆసక్తిని రేపుతోంది.