Ram Charan and Jr NTR: ప్రభాస్ 3.. బన్నీ 2.. లెక్క సరి చేద్దామనుకున్న ఎన్టీఆర్, చరణ్ ఆశలపై నీళ్లు

Ram Charan and Jr NTR: తెలుగు సినిమా రూపు రేఖలు మార్చేసింది బాహుబలి. సినిమాలో దమ్ముంటే భాషా బేధాలు, ప్రాంతీయవాదాలు అడ్డురావని, వసూళ్ల వర్షం కురుస్తుందని నిరూపించింది. ఇండియన్ బాక్సాఫీస్ శక్తి, స్థాయి ఏమిటో కూడా బాహుబలి చిత్రాలతో రుజువైంది. వెయ్యి కోట్ల వసూళ్లు ఓ ఇండియన్ సినిమా సాధిస్తుందన్న ఊహ కూడా లేని సమయంలో అది నిజం చేసి చూపించింది. అదే సమయంలో తెలుగు సినిమాలు బాగుంటాయంటే ఓ పాజిటివ్ ఫీలింగ్ అన్ని భాషల […]

Written By: Shiva, Updated On : January 3, 2022 9:42 am

RRR

Follow us on

Ram Charan and Jr NTR: తెలుగు సినిమా రూపు రేఖలు మార్చేసింది బాహుబలి. సినిమాలో దమ్ముంటే భాషా బేధాలు, ప్రాంతీయవాదాలు అడ్డురావని, వసూళ్ల వర్షం కురుస్తుందని నిరూపించింది. ఇండియన్ బాక్సాఫీస్ శక్తి, స్థాయి ఏమిటో కూడా బాహుబలి చిత్రాలతో రుజువైంది. వెయ్యి కోట్ల వసూళ్లు ఓ ఇండియన్ సినిమా సాధిస్తుందన్న ఊహ కూడా లేని సమయంలో అది నిజం చేసి చూపించింది. అదే సమయంలో తెలుగు సినిమాలు బాగుంటాయంటే ఓ పాజిటివ్ ఫీలింగ్ అన్ని భాషల ప్రేక్షకులలోకి తీసుకెళ్లింది. అందుకే మన స్టార్ హీరోలందరూ ఇతర పరిశ్రమలపై దండెత్తుతున్నారు.

Ram Charan and Jr NTR

హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గుర్తింపు తెచ్చుకోవడం ద్వారా పాన్ ఇండియా హీరోలుగా ఎదగాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ నుండి ప్రభాస్ ఇప్పటికే ఆ ఫీట్ సాధించారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ అదే స్థాయిలో తెరకెక్కుతున్నాయి. రాధే శ్యామ్ నుండి స్పిరిట్ వరకు మొత్తం నాలుగు సినిమాలు ఆయన చేస్తున్నారు. ఈ నాలుగు చిత్రాల బడ్జెట్ దాదాపు రూ. 1500 కోట్ల పైమాటే.

Also Read: టాలీవుడ్ లో ముసలం: ఇండస్ట్రీ పెద్దను కాదన్న చిరంజీవికి మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్

ఇక ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకున్న మన స్టార్స్ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ విషయంలో కొంచెం స్పీడ్ గా ఉన్నారు. లోకల్ ప్రాజెక్ట్ గా మొదలైన పుష్ప ను పాన్ ఇండియాగా మార్చారు. హిందీలో మంచి వసూళ్లు రాబడుతున్న పుష్ప అల్లు అర్జున్ ఆశలు నెరవేర్చినట్లే కనిపిస్తుంది. అనూహ్యంగా గత రెండు చిత్రాలతో అల్లు అర్జున్ టాప్ రేసులోకి దూసుకొచ్చారు. టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో లిస్ట్ లో ఆయనవి రెండు చిత్రాలు ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్ గా ప్రభాస్, అల్లు అర్జున్ చిత్రాలు నిలిచాయి. ఈ లిస్ట్ లో వరుసగా బాహుబలి 2, బాహుబలి, సాహో, పుష్ప, అల వైకుంఠపురంలో చిత్రాలు ఉన్నాయి. మూడు చిత్రాలతో ప్రభాస్ మొదటి స్థానంలో ఉండగా అల్లు అర్జున్ రెండు చిత్రాలతో రెండవ స్థానం అందుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో బాహుబలి తో పాటు టాలీవుడ్ రికార్డ్స్ సరిచేద్దామనుకున్న ఎన్టీఆర్, చరణ్ ఆశలపై వైరస్ వ్యాప్తి మరోసారి నీళ్లు చల్లింది.

భారీ ప్రమోషన్స్ తో పాటు సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో బీభత్సంగా ఆర్ ఆర్ ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2 మిలియన్ మార్క్ కి దగ్గరైంది ఆర్ ఆర్ ఆర్. అలాంటి సమయంలో వాయిదా పడి భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ కోల్పోయింది. ఏది ఏమైనా ప్రస్తుతానికి టాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్స్ గా ప్రభాస్, అల్లు అర్జున్ నిలిచారు.

Also Read: నార్త్‌లోనూ ‘తగ్గేదేలే’.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘పుష్ప’ రాజ్..

Tags