Homeజాతీయ వార్తలుTrain Travel Demand: 1.09 కోట్ల డిమాండ్ ఎక్కువ.. రైళ్లు తక్కువ.. మన రైల్వే పరిస్థితి...

Train Travel Demand: 1.09 కోట్ల డిమాండ్ ఎక్కువ.. రైళ్లు తక్కువ.. మన రైల్వే పరిస్థితి మారేదెలా?

Train Travel Demand: రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ. రోడ్డు మార్గాలు ఉన్నా.. దూరప్రాంత ప్రాయాణాలకు ఎక్కువ మంది ఉపయోగించే రవాణా సాధనం రైలు. పేద, మధ్యతరగతిలోపాటు సంపన్నులు కూడా రైలు ప్రయాణాన్ని సౌకర్యంగా భావిస్తారు. భారత రైల్వే ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. కానీ, ఇప్పటికీ రద్దీకి తగినట్లుగా రైలు సౌకర్యాలు అందుబాటులో లేవు. ఏటా వేలాది మంది ప్రయాణికులు టికెట్‌ రద్దు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. గడిచిన మూడేళ్లలో 1.09 కోట్ల టికెట్లు రద్దయ్యాయి. దీంతో రైల్వే భారీగా ఆదాయం కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం రైలు టికెట్‌ కన్‌ఫామ్‌ కాకపోవడమే. కొవిడ్‌ తర్వాత ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటకం వైపు పెరిగిన ఆసక్తి రైలు ప్రయాణ డిమాండ్‌ను గణనీయంగా పెంచింది. అయితే, వెయిటింగ్‌ లిస్ట్‌ సమస్య, టికెట్‌ కన్ఫర్మేషన్‌ లేకపోవడం వల్ల ప్రయాణికులు ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. ఇంత పెద్ద ఎత్తున టికెట్లు రద్దయ్యాయంటే.. దేశంలో రైళ్ల డిమాండ్‌ ఏమేరకు ఉందో అర్థమవుతుంది.

Also Read: ఏపీ అభివృద్ధికి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్!

రైలు ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌..
కొవిడ్‌ మహమ్మారి తర్వాత ప్రజలు ప్రకృతి పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ వంటి ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. విమాన టికెట్ల ధరలు గణనీయంగా పెరగడంతో రైలు ప్రయాణం సరసమైన ఎంపికగా మారింది. అయితే, సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన మార్గాల్లో రైళ్ల సంఖ్య డిమాండ్‌ను తట్టుకోలేకపోతోంది. పండగలు, వేసవి సెలవుల సమయంలో సగటున 400–500 సీట్ల వెయిటింగ్‌ లిస్ట్‌ సాధారణమైంది. దీంతో చాలామంది బుకింగ్‌కు దూరంగా ఉంటున్నారు. లేదా టికెట్‌ కన్ఫర్మ్‌ కాకపోవడంతో ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.

వెయిటింగ్‌ సమస్య..
మూడేళ్లలో దక్షిణ మధ్య రైల్వేలో 1.09 కోటి టికెట్లు రద్దయ్యాయి, సగటున ఏటా 36.3 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణానికి దూరమయ్యారు. ఇందులో 66% (72.13 లక్షలు) స్లీపర్‌ క్లాస్‌ టికెట్లు, చైర్‌కార్‌లో 1.15 లక్షలు, సెకండ్‌ సిటింగ్‌లో 4 లక్షల మంది ఉన్నారు. ఈ రద్దులు టికెట్‌ కన్ఫర్మేషన్‌ లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి.

హై స్పీడ్‌ రైళ్లకు ఆదరణ
వందేభారత్, రాజధాని, దురంతో, శతాబ్ది వంటి వేగవంత రైళ్లు ధర ఎక్కువైనప్పటికీ, వేగం, సౌకర్యం కారణంగా డిమాండ్‌లో ఉన్నాయి. సికింద్రాబాద్‌–విశాఖపట్నం మార్గంలో రెండు వందేభారత్‌ రైళ్లు ఉన్నప్పటికీ, టికెట్లు త్వరగా అయిపోతున్నాయి. ఈ రైళ్లు పూర్తిగా ఏసీ బోగీలతో నడుస్తున్నప్పటికీ, సామాన్య ప్రయాణికులకు స్లీపర్, సెకండ్‌ సిటింగ్‌ వంటి సరసమైన ఎంపికలు ఎక్కువగా అవసరమవుతున్నాయి. ఈ డిమాండ్‌ను తీర్చడానికి రైల్వే శాఖ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. టికెట్‌ రద్దుల వల్ల దక్షిణ మధ్య రైల్వే గత మూడేళ్లలో రూ.395.03 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నష్టం అదనపు బోగీలు లేదా రైళ్లను ఏర్పాటు చేయడం ద్వారా నివారించే అవకాశం ఉంది. రద్దు ఛార్జీల రూపంలో రైల్వే రూ.698 కోట్లు సంపాదించినప్పటికీ, ఇది దీర్ఘకాలిక ఆదాయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular