Ustaad Bhagat Singh Shooting: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గత కొంతకాలంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలలు పాలనలో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘హరి హర వీరమల్లు’ మరియు ‘ఓజీ’ చిత్రాలను పూర్తి చేశాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన వెంటనే ఆయన గత 40 రోజుల నుండి హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తనకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం పాటల చిత్రీకరణలో బిజీ గా ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకరాల్లో గత కొంతకాలంగా పాటలను చిత్రీకరిస్తున్న మూవీ టీం, ప్రస్తుతం పాటల చిత్రీకరణలో బిజీ గా ఉంది.
Also Read: గుర్రం పాపిరెడ్డి టీజర్ రివ్యూ: యోగిబాబు, బ్రహ్మానందం కలిపి కొట్టిన కామెడీ మరీ
అయితే గత వారం రోజుల నుండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ యూనియన్ అద్వర్యం లో సినీ కార్మికుల వేతనాలు 30 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ బండ్ ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా టాలీవుడ్ లో షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ మాత్రం విరామం లేకుండా సాగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డేట్స్ ఆగష్టు 8 వరకే ఇచ్చాడు, అప్పటి లోపు షూటింగ్ పూర్తి చెయ్యాలని. బండ్ కారణంగా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు దొరక్కపోవడం తో మేకర్స్ ముంబై మరియు చెన్నై నుండి ఆర్టిస్టులను తీసుకొచ్చి షూటింగ్ చేస్తున్నారు. ఇది తెలుసుకున్న యూనియన్ సభ్యులు ఉస్తాద్ భగత్ సింగ్ లొకేషన్ కి వచ్చి పెద్ద గొడవ చేసేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తుండగా పెద్ద గొడవ క్రియేట్ అయ్యింది.
చాలా సేపటి వరకు ఆ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. కానీ పోలీసులు చొరవ తీసుకొని వాళ్ళని బలంగా ఆపి వెనక్కి పంపడంతో షూటింగ్ తిరిగి కొనసాగింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ గొడవకు సంబంధించిన కొన్ని విజువల్స్ ని మీకోసం క్రింద అందిస్తున్నాం చూడండి. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని వచ్చే ఏడాది జనవరి నెలలో కానీ, లేకపోతే సమ్మర్ లో కానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియో ముందు యూనియన్ నాయకులతో పోలీసుల వాగ్వివాదం#UstaadBhagatSingh pic.twitter.com/INemkVlWjl
— Telugu360 (@Telugu360) August 4, 2025