Ground Report Survey: వచ్చేసారి తెలంగాణలో ఎవరిది అధికారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? అందరూ అనుకున్నట్టే కేసీఆర్ ఓడిపోడు.. కానీ సీఎం కాలేడు. మరి ఎవరు అవుతారు? అంటే పక్కాగా రేవంత్ రెడ్డి అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ మేరకు తాజాగా వెలువడ్డ ఓ సంచలన సర్వేలో ప్రజలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారని తేటెతెల్లమైంది.
kcr revanth bandi sanjay
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో ఇక తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని.. టీఆర్ఎస్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ దూసుకురావడం ఖాయం అనుకున్నారు. ఇక అస్సలు ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ అసలు పోటీనే కాదన్నారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ కాదు.. అలాగని హుజూరాబాద్ గెలిచి ఊపు మీదున్న బీజేపీ కూడా కాదు.. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. అవును ‘గ్రౌండ్ రిపోర్ట్’ అనే సంస్థ తెలంగాణలో చేసిన సర్వేలో సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని తాజా రాజకీయ పరిస్థితులను బట్టి తేటతెల్లమవుతోంది. ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించడంతో రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అసలు తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు? తదుపరి సీఎంగా ఎవరు పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారన్నది ఆసక్తిగా మారింది.
ఈ నేపథ్యంలోనే ‘గ్రౌండ్ రిపోర్ట్’ అనే సంస్థ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 4వేల మంది ఓటర్ల అభిప్రాయాలు తీసుకొని క్రోడీకరించింది. ఈ సర్వేలో ఎమ్మెల్యే అభ్యర్థితోపాటు సీఎం అభ్యర్థిపై వేర్వేరుగా ప్రశ్నలు సంధించారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్ల నాడిని తెలుసుకొని ‘గ్రౌండ్ రిపోర్ట్’ సర్వే ఫలితాలు వెల్లడించింది.
ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 65-70(ఎంఐఎం-6) సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీకి 35-40 సీట్లు, బీజేపీకి 12-14 సీట్లు, ఇతరులు 0-1 సీట్లు వస్తాయని తేల్చారు.
సీట్ల విషయంలో ‘గ్రౌండ్ రిపోర్ట్’ సర్వే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా.. సీఎం విషయంలో మాత్రం ప్రజలు భిన్నమైన తీర్పునివ్వడం విశేషం.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని 44శాతం మంది అభిప్రాయపడగా.. కేసీఆర్ కు 42శాతం మంది ఓట్లేయడం విశేషం. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కావాలన్న వారు కేవలం 6-7శాతం మంది మాత్రమే.
ఈ సర్వే ఫలితాలను గ్రౌండ్ రిపోర్ట్ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. రానున్న రోజుల్లో ప్రజల అభిప్రాయాలు ఇంకెలా మారుతాయో అన్నది వేచిచూడాలి.
https://twitter.com/janta_poll/status/1458792992186142722?s=20