Homeఎంటర్టైన్మెంట్RRR Movie: టికెట్టు ధరల తగ్గింపుపై జగన్​తో చర్చిస్తాం- 'ఆర్​ఆర్​ఆర్​' నిర్మాత

RRR Movie: టికెట్టు ధరల తగ్గింపుపై జగన్​తో చర్చిస్తాం- ‘ఆర్​ఆర్​ఆర్​’ నిర్మాత

RRR Movie: తాజాగా ఆంధ్రప్రదేశ్​ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినిమా టికెట్టు ధరల తగ్గింపుపైనా పలు రకాలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై ‘ఆర్​ఆర్​ఆర్’ నిర్మాత డివివి దానయ్య స్పందించారు. టికెట్​పై ధరలు తగ్గించడం సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ఫలితంగా చిత్రబృందం త్వరలో కోర్టు మెట్లు ఎక్కుతుందంటూ గత కొన్ని రోజుల నుంచి  వరుస కథనాలు సోషల్​మీడియాలో వినిపించాయి.

rrr-movie-producer-respnd-on-reducing-ticket-prices-in-ap

ఇటువంటి వార్తలు వెలువడుతున్న క్రమంలో తాజాగా దానయ్య స్పందించారు. ఏపీలో సినిమా టికెట్టు ధరలు తగ్గిస్తే..  మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే, ఈ విషయంపై న్యాయం కోసం ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరగదు. ఎపీ ముఖ్యమంత్రి జగన్​ను కలిసి మా పరిస్థితిని తెలియజే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. దీనికి సరైన పరిష్కారం కావాలి. అని ట్విట్టర్​ వేదికగా దానయ్య తెలిపారు.

RRR Glimpse ft. NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | S.S. Rajamouli | Releasing on 7th Jan 2022

ఎన్టీఆర్​, రామ్​చరణ్​ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్​, ఎమోషనల్​ డ్రామా ఆర్​ఆర్ఆర్​. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమోలు, సాంగ్స్​ సినిమాపై వేరే లెవెల్​ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్​లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.

డీవీవీ దానయ్య ఈ సినమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.  ఆలియాభట్‌ ఒలీవియా మోరీస్‌ హీరోయిన్​లు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version