తాత కేసీఆర్ కు తగ్గ మనవడు.. అప్పుడే అవార్డ్

తాత కేసీఆర్ దస్ నంబర్ అయితే మనవడు హిమాన్స్ ఏక్ నంబర్ అవుతాడా? అతడు కూడా దస్ నంబర్ యే అవుతాడు. కేసీఆర్ తెలంగాణ సమాజ సేవలో తరిస్తుంటే ఆయన మనవడు హిమాన్ష్ గజ్వేల్ సేవలో తరిస్తున్నాడు. ఎంతైనా తాత సొంత నియోజకవర్గం కదా..? మనవడు ఆ మాత్రం అభివృద్ధి చేస్తుంటాడు. అందుకే ఇప్పుడు ఆ ప్రజాసేవకు ఏకంగా అంతర్జాతీయ అవార్డు దక్కింది. సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. […]

Written By: NARESH, Updated On : June 29, 2021 10:28 am
Follow us on

తాత కేసీఆర్ దస్ నంబర్ అయితే మనవడు హిమాన్స్ ఏక్ నంబర్ అవుతాడా? అతడు కూడా దస్ నంబర్ యే అవుతాడు. కేసీఆర్ తెలంగాణ సమాజ సేవలో తరిస్తుంటే ఆయన మనవడు హిమాన్ష్ గజ్వేల్ సేవలో తరిస్తున్నాడు. ఎంతైనా తాత సొంత నియోజకవర్గం కదా..? మనవడు ఆ మాత్రం అభివృద్ధి చేస్తుంటాడు. అందుకే ఇప్పుడు ఆ ప్రజాసేవకు ఏకంగా అంతర్జాతీయ అవార్డు దక్కింది.

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. తన కొడుకు సాధించాడని కేటీఆర్ ట్విటర్ లో ఘనంగా చాటిచెప్పాడు. బ్రిటన్ నుంచి డయానా అవార్డును హిమాన్షు అందుకున్నాడు.

ప్రపంచంలో సమాజంలో మార్పు కోసం.. మానవీయ దృక్పథంతో కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ ‘డయానా’ అవార్డును ఇస్తుంటారు. దివంగత బ్రిటన్ రాజకుమారి ‘డయానా’ పేరు మీద 1999 నుంచి ఈ అవార్డులు అందజేస్తున్నారు. ఈ అవార్డును 9-25 ఏళ్ల మధ్య ఉన్న వారికే ఇస్తారు. ప్రస్తుతం హిమాన్షు 15 ఏళ్లకే ఈ అవార్డు పొందడం విశేషం.

ఇక కేసీఆర్ మనవడు ఈ అవార్డు పొందడానికి సాధించిన కృషి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తాత కేసీఆర్ బాటలోనే అప్పుడే మనవడు హిమాన్ష్ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నాడు. తాత నియోజకవర్గం ‘గజ్వేల్ నియోజకవర్గంలో ‘శోమ’ పేరుతో ప్రాజెక్టును హిమాన్షు ప్రారంభించారు. గజ్వేల్ లోని రెండు గ్రామాల్లో కల్తీలేని ఆహార పదార్థాలు తయారు చేసే పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను సేకరించడం..వాటిని ప్రాసెసింగ్ చేయటం.. ప్యాకింగ్ చేయడం వంటి బాధ్యతలన్నీ గ్రామస్థులకు అప్పగించారు. ఈ ప్రాజెక్టులో వినియోగించిన యంత్రాలకు సౌరవిద్యుత్ నే వాడుతున్నారు. ఈ ప్రాజెక్టు ఐక్యరాజ్యసమితి నిర్ధేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 17 సాధించింది. దీంతో కేటీఆర్ కు ఈ అవార్డు వచ్చింది.

అయితే హిమాన్షు ఇంత చిన్న వయసులో అంత పెద్ద పనిచేస్తాడని ఊహించలేం. సీఎం కేసీఆర్ నియోజకవర్గం కావడంతో ఇందులో అధికారుల సహాయం కూడా ఉండి ఉంటుందన్న   గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం మనవడు కావడంతో  సమాజ సేవ అడ్డంకులే ఉండకపోవచ్చు.. మొత్తానికి ఎలాగోలా ఇంత చిన్న వయసులోనే సమాజ సేవలో హిమాన్షు ఈ అవార్డు అందుకోవడం విశేషమనే చెప్పొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.