Union Budget Of India 2022: తమది రైతు అనుకూల ప్రభుత్వమని కేంద్రప్రభుత్వం గతంలో చాలా సార్లు చెప్పిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోనూ అదే విషయం మరోసారి స్పష్టం చేశారు. అగ్రికల్చర్ తమ ప్రయారిటీస్‌లో ఒకటని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైతు పండించిన వానాకాలం పంట గోధుమల, యాసంగి పంట వరి ధాన్యం సేకరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, వరి ధాన్యం 163 లక్షల టన్నులను సేకరించనున్నారు. ఈ ధాన్యానికిగాను కనీస మద్దతు ధర ప్రకారం రైతుల అకౌంట్లలోకి డైరెక్ట్‌గా రూ.2.37 లక్షల కోట్లు జమ చేయనున్నారు. ఇకపోతే వ్యవసాయంలో రసాయనాల వినియోగం తగ్గించేందుకు సహజ వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించనున్నారు. 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించిన నేపథ్యంలో తృణధాన్యాల సాగుకు సరైన ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంతో తెలిపారు. ఆయిల్ విత్తనాల దిగుమతి తగ్గించేందుకుగాను స్థానికంగానే వాటిని ప్రొడ్యూస్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
Also Read: Union Budget Of India 2022: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?
ఇకపోతే రైతులు ఇంకా సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని గైడ్ చేసేందుకుగాను హైటెక్, డిజటల్ సర్వీస్ లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకుగాను ప్రైవేట్ అగ్రిటెక్ ప్లేయర్స్‌తో పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వ్యవసాయంలో కిసాన్ డ్రోన్స్ ఉపయోగించేందుకు పర్మిషన్స్ ఇస్తామన్నారు.
Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?
మోడ్రన్ అగ్రికల్చర్ పద్ధతులను అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సిలబస్‌లో మార్పులు చేసేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కోరారు. అగ్రికల్చర్ స్టార్టప్స్‌కు ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్పారు. మొత్తంగా వ్యవసాయ ప్రధానమైన దేశంలో సహజ సిద్ధంగా వ్యవసాయం చేసేందుకుగాను అవసరమైన చర్యలన్నిటినీ తీసుకోబోతున్నట్లు తెలిపారు. అయితే, కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ శాఖ కేటాయింపుల గురించి బడ్జెట్ ప్రసంగం తర్వాత బీజేపీ నేతలు గొప్పగా చెప్తున్నారు. కానీ, విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి. ఎరువుల ధరలు పెంచారని తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ విమర్శిస్తోంది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వంపైన విమర్శలు చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించింది.