Govind Jaiswal success story: సాధారణంగా ఒక వ్యక్తి అత్యున్నత స్థాయిలో ఉన్నాడు అంటే అతని తండ్రి కూడా అంతకుముందు చదువుకున్న వారు అయి ఉండాలి.. లేదా అతనికి ఎవరైనా సపోర్ట్ చేసి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు.. కానీ నేటి కాలంలో చాలామంది ఎలాంటి సపోర్టు లేకుండా ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణిస్తున్నారు. అయితే ఒక రిక్షా నడిపే కొడుకు కలెక్టర్ అయ్యారు అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆ స్టేజి నుంచి కలెక్టర్ స్థాయికి వెళ్లడం అంటే ఆశామాసి కాదు. కానీ చదువుకునేందుకు.. కలెక్టర్ అయ్యేందుకు పేదరికం అడ్డు కాదని ఒక యువకుడు నిరూపించాడు. తనకు జరిగిన ఒక అవమానం కారణంగా అతనిలో కసి పెరిగి కలెక్టర్ అయ్యేందుకు తోడ్పడింది. ఇంతకు ఆయన ఎవరు? ఆయనకు జరిగిన అవమానం ఏంటిది?
ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు… యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు అనే నానుడి ఉంది. కానీ రిక్షా నడిపే వ్యక్తి కొడుకు మాత్రం రిక్షా నడపాలని ఎవరు అనుకోరు. తన కొడుకు కనీసం తనకంటే బాగుండాలని తండ్రులు కోరుకుంటారు. కానీ ఒక రిక్షా నడిపే వ్యక్తి కొడుకు బాగా ఉండడమే కాకుండా కలెక్టర్ స్థాయికి వెళ్ళాడు. వారణాసి జిల్లాకు చెందిన రిక్షా పుల్లర్ కొడుకు గోవిందు జైస్వాల్ అత్యంత కఠినమైన పేదరికంలో జన్మించాడు. చిన్నప్పుడు చదువుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేవు. అయినా కూడా తన స్తోమతకు తగిన విధంగా స్కూలుకు వెళ్లేవాడు. అయితే ఒకసారి ధనవంతుడు అయినా తన స్నేహితుడితో కలిసి వారి ఇంట్లోకి వెళ్ళాడు. అయితే ఆ స్నేహితుడి తండ్రి గోవిందు జైస్వాల్ గురించి తెలిసి అతడిని ఇంట్లో నుంచి బయటకు పంపాడు. ఒక రిక్షా నడిపే వ్యక్తి రిక్షా మాత్రమే నడుపుతాడంటూ అవహేళన చేశాడు.
ఇలా అవమానాన్ని ఎదుర్కొన్న అతడు తాను కూడా అత్యంత ఉన్నత స్థాయికి వెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం పాఠశాల స్థాయి చదువు పూర్తి అయిన తర్వాత వెంటనే కలెక్టర్ కావాలన్నా ఆలోచన పెంచుకున్నాడు. అయితే ఢిల్లీలో కోచింగ్ తీసుకోవడానికి వెళ్లేందుకు అతని దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. తన కొడుకు ఆరాటం చూసిన తండ్రి తనకు ఉన్న చిన్న స్థలాన్ని రూ.40,000 కు విక్రయించాల్సి వచ్చింది. దీంతో మరింత కసి పెంచుకున్న గోవిందు జైస్వాల్ ఒకపూట మాత్రమే అన్నం తింటూ.. ప్రతిరోజు కష్టపడి చదివేవాడు. అలా 24 ఏళ్ల వయసులోనే మొదటి ప్రయత్నంలోనే కలెక్టర్ అయ్యాడు.
చిన్నప్పటి నుంచి ఎంతోమంది సపోర్టు ఉన్నవారు సైతం మొదటి ప్రయత్నంలోనే కలెక్టర్ కావడానికి అవకాశం రావడం లేదు. కానీ గోవింద్ జైస్వాల్ మాత్రం మొదటి ప్రయత్నంలోనే కలెక్టర్ అయిన తర్వాత అతని తండ్రి ఎంతో సంతోషించాడు.