https://oktelugu.com/

వైసీపీ నేతల జేబులు నింపుతున్న మద్యం విధానం

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు ప్రధాన ఆదాయవనరుగా ఉంది. మద్యం అమ్మకాలలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్ నేరుగా ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. బార్లను మినహాయిస్తే వినియోగదారుడు కొనే ప్రతి మద్యం బాటిల్ ప్రభుత్వమే విక్రయిస్తుంది. కరోనా కారణంగా బార్ అండ్ రెస్టారెంట్ లకు అనుమతి లేని కారణంగా మద్యం కేవలం ప్రభుత్వ దుకాణాలలోనే లభ్యం అవుతుంది. అమ్మకాల పరంగా సగానికి సగం తగ్గించగలిగాం అని చెవుతున్నా, వినియోగదారుడికి అయ్యే ఖర్చు మాత్రం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 7, 2020 / 10:19 AM IST
    Follow us on


    ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు ప్రధాన ఆదాయవనరుగా ఉంది. మద్యం అమ్మకాలలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్ నేరుగా ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. బార్లను మినహాయిస్తే వినియోగదారుడు కొనే ప్రతి మద్యం బాటిల్ ప్రభుత్వమే విక్రయిస్తుంది. కరోనా కారణంగా బార్ అండ్ రెస్టారెంట్ లకు అనుమతి లేని కారణంగా మద్యం కేవలం ప్రభుత్వ దుకాణాలలోనే లభ్యం అవుతుంది. అమ్మకాల పరంగా సగానికి సగం తగ్గించగలిగాం అని చెవుతున్నా, వినియోగదారుడికి అయ్యే ఖర్చు మాత్రం తగ్గకపోగా రెట్టింపు అయ్యింది.

    చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

    ఒకప్పుడు రూ.50 నుండి రూ. 60 రూపాయలకు దొరికే చీప్ లిక్కర్ కనీస ధర రూ. 180గా ఉంది. అంటే మూడు బాటిల్స్ వచ్చే ధరకు కేవలం ఒక బాటిల్ మాత్రమే వస్తుంది. తరువాత రూ. 250-260 స్థాయిలో ధరలు ఉన్నాయి. అంత రేటుపెట్టి కొన్నా ఆ మద్యం నాన్ బ్రాండెడ్. ఇది వరకు ఎప్పుడు ఎరుగని పేర్లతో, కేవలం వారం రోజుల తయారీ తేదీలతో షాపులోకి అందుబాటులోకి వస్తున్నాయి. వందలు వెచ్చించి వినియోగదారులు నాన్ బ్రాండెడ్ పచ్చి సరుకు కొనుక్కొని సేవిస్తున్నారు. ఇది దీర్ఘ కాలంలో వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

    వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా?

    ఈ నాన్ బ్రాండెడ్ లిక్కర్ ప్రభుత్వానికి అతి తక్కువ ధరకు లభ్యం అవుతుంది. మద్యం సరఫరా సంస్థల నుండి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి దానికి అత్యధిక ధరలకు వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీనితో సేల్స్ పరంగా క్వాన్టిటీ తగ్గినా, ఆదాయం మాత్రం భారీగా వస్తుంది. అలాగే వైసీపీ నేతలు కూడా దీనిని తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో దర్శనమిస్తున్నఈ నాన్ బ్రాండెడ్ మద్యం బాటిళ్లు, వైసీపీ నేతల పరిశ్రమలలో తయారయ్యేవే అని సమాచారం ఉంది. రెగ్యులర్ బ్రాండ్స్ కొనుగోళ్లు తగ్గించి ప్రభుత్వం తమ నేతల పరిశ్రమలో తయారయ్యే నాసిరకం మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా వైసీపీ నేతలకు ప్రభుత్వం లభ్ది చేకూర్చుతుంది. మద్యానికి, తాగుబోతులకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితుల నేపథ్యంలో, టీడీపీ కూడా దీనిపై నోరుమెదపలేక పోతుంది.