https://oktelugu.com/

రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ ట్రైలర్ టాక్ !

డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరో అయ్యాడు, కొన్నాళ్ళు పాటు ఫామ్ లో కూడా కొనసాగాడు. అయితే రాజ్ తరుణ్ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడిపోయాడు. ఒకప్పుడు ఒక్క హిట్ కొట్టినా కనీసం పదేళ్ల కెరీర్ ఉంటుంది ఆ హీరోకి. కానీ ఇప్పడు అలా లేదు. ఒక్క ప్లాప్ తో హీరోలు తమ మార్కెట్ ను పూర్తిగా కోల్పోతున్నారు. ఈ క్రమంలో లవ్‌, కామెడీ […]

Written By:
  • admin
  • , Updated On : February 4, 2021 / 03:22 PM IST
    Follow us on


    డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరో అయ్యాడు, కొన్నాళ్ళు పాటు ఫామ్ లో కూడా కొనసాగాడు. అయితే రాజ్ తరుణ్ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడిపోయాడు. ఒకప్పుడు ఒక్క హిట్ కొట్టినా కనీసం పదేళ్ల కెరీర్ ఉంటుంది ఆ హీరోకి. కానీ ఇప్పడు అలా లేదు. ఒక్క ప్లాప్ తో హీరోలు తమ మార్కెట్ ను పూర్తిగా కోల్పోతున్నారు. ఈ క్రమంలో లవ్‌, కామెడీ సినిమాలకు కామా పెట్టి “పవర్‌ ప్లే”తో ఓ థ్రిల్లర్‌ మూవీతో రాబోతున్నాడు రాజ్‌ తరుణ్‌. తన గత చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండ మరోసారి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఆరోజే

    కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం ఉదయం రిలీజ్‌ చేశారు. ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా సాగిపోయిన ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. ఒక్కమాటలో ఏవరేజ్ గా అనిపిచింది. ట్రైలర్ ను చూస్తుంటే ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు అర్ధమవుతుంది. ముఖ్యంగా ట్రైలర్ లో ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే ట్రైలర్ ని కట్ చేయడంతో మొత్తానికి ఈ థ్రిల్లర్ మూవీకి అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంది. అలాగే సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం.. ఐ. ఆండ్రీ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో హేమాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్ర పోషించింది.

    Also Read: ‘మహా నటి’ ఖాతాలో మరో అరుదైన ఘనత

    కాగా ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డిఫరెంట్ జానర్ తో వస్తున్న విజయ్ కుమార్ కొండ – రాజ్ తరుణ్ లకు ‘పవర్ ప్లే’ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక వరుసగా రెండు మూడు ప్లాప్ లు వస్తే.. ఇక ఆ హీరో, జీరోగా మిగిలిపోతున్నాడు. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌ పరిస్థితి అలాగే అయిపొయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్లు చేసే రాజ్ తరుణ్ మరీ ఈ నాటకీయ థ్రిల్లర్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్