Maoist Party: మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మావోయిస్టు పార్టీని అంతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వాలు తమదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ చనిపోవడానికి కారణం పోలీసులు అమలు చేసిన వ్యూహమే అని తెలుస్తోంది. మావోయిస్టులను ఏరివేసే క్రమంలో నూతన పద్ధతులు ఆవిష్కరిస్తున్నారు. గోటి తోటి పోయే దాన్ని గొడ్డలి దాకా ఎందుకని భావించి సునాయసంగా తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో మావోయిస్టులకు నష్టాలే జరుగుతున్నాయి.

మావోయిస్టులపై ఆపరేషన్ సమాధాన్ పథకాన్ని ప్లాన్ చేశారు. మావోయిస్టులను ఎదుర్కొనే క్రమంలో కేంద్రం అమలు చేస్తున్న పక్కా వ్యూహం ఆపరేషన్ సమాధాన్ తో ఆర్కే మరణం సంభవించిందని తెలుస్తోంది. చత్తీస్ గడ్ పోలీసుల పక్కా సమాచారంతోనే ఈ వ్యూహాన్ని అమలు పరిచినట్లు తెలుస్తోంది. గతంలో అయితే కూంబింగ్ లు నిర్వహిస్తూ ఎదురుకాల్పులకు తెగబడేవారు. దీంతో ఇరు పార్టీల్లో తీవ్ర నష్టం జరిగేది. దీంతో వ్యూహాలను మార్చుతున్నారు.
ఇందులో భాగంగానే మావోయిస్టులకు ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా చేసేందుకే పకడ్బందీ వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకు ఎవరు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అనారోగ్యంతో ఉన్న ఆర్కే బయటకు రాకుండా కట్టడి చేశారు. దీంతో వ్యాధి ముదిరి ఆయన అకాల మరణం చెందారని తెలుస్తోంది. దీంతో పోలీసులకు మావోలకు పెద్ద సవాలు విసిరారు.
దీనికి తోడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పెద్ద పీట వేస్తున్నారు. రహదారుల కోసం రూ. 2,800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరో రూ.4,600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రెండు నెలలకోసారి కేంద్ర హోంశాఖ కార్యదర్శి డీజీపీ, సీఎస్ లతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని సూచిస్తున్నారు. మావోల ఏరివేతపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ సమాధాన్ అమలుకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం.